Indiaక్రైంజాతీయంహైదరాబాద్

Firecracker Factory Explosion : బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం, బాణాసంచా ఫ్యాక్టరీ పే లుడులో 10 మంది దుర్మరణం

Firecracker Factory Explosion : ప్రజా దీవెన, గుజరాత్: కళ్లు చెది రే వెలుగులు నింపాల్సిన ఆ బా ణాసంచా తయారీ కేంద్రం ఒక్క సారిగా మృత్యుకూపంగా మారిం ది. గుజరాత్‌లోని రామోల్ ప్రాం తంలో చోటుచేసుకున్న భయం కర పేలుడు స్థానికులను తీవ్ర భ యాందోళనలకు గురిచేసింది. ని మిషాల వ్యవధిలోనే ఆ ప్రాంత మంతా దట్టమైన పొగ, భీకరమై న శబ్దాలతో అల్లకల్లోలంగా మా రిపోయింది. ఈ విషాదకర ఘట నకు సంబంధించి పూర్తి వివరా లు ఇలా ఉన్నాయి.

పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం క్షణాల్లో కుప్పకూలిపోయింది. అ క్కడికక్కడే10 మంది కార్మికులు రక్తం ఓడుతూ ప్రాణాలు విడిచా రు. సమాచారం అందుకున్న వెం టనే అగ్నిమాపక సిబ్బంది రె స్క్యూ వాహనాలతో రంగాంలోకి దిగారు. గంటల తరబడి శ్రమిం చి, ప్రాణాలకు తెగించి మంటల ను అదుపులోకి తీసుకొచ్చారు.

సీజ్ చేసినా మారని వైఖరి.. అధి కారుల సీల్ తుచ్ఛం

ఈ ఘోర ప్రమాదం వెనుక కేవ లం అగ్నిప్రమాదమే కాదు, అం తకుమించిన మానవ నిర్లక్ష్యం, అక్రమ వ్యవహారం దాగి ఉందని తేలింది. ఎలాంటి చట్టబద్ధమైన లైసెన్సులు లేకపోవడంతో, అధి కారులు ఈ ఏడాది మార్చి 31నే సదరు ఫ్యాక్టరీని అధికారికంగా సీజ్ (Seal) చేశారు. కానీ, యజ మానులకు చట్టమన్నా, కార్మికు ల ప్రాణాలన్నా రవ్వంతైనా భ యం లేకుండాపోయింది. అధికా రుల సీల్‌ను బేఖాతరు చేస్తూ, చాటుమాటుగా అక్రమ తయా రీని కొనసాగించారు. ఈ బరితె గింపే చివరికి 10 మంది అమా యక కార్మికుల ప్రాణాలను బలి గొందని చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు తీవ్రస్థాయిలో కేసు నమోదుచేసి, నిందితులను పట్టుకునేందుకు స మగ్ర దర్యాప్తు వేగవంతం చేశా రు. సంతోషాలను పంచాల్సిన ఫ్యాక్టరీ, ఇలాంటి అక్రమార్కుల స్వార్థం వల్ల పలు కుటుంబాల్లో ఆరని శోకాన్ని నింపడం పట్ల స్థా నికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు.

Related Articles

Back to top button