US Road Accident :ప్రజా దీవెన, అమెరికా: అగ్రరాజ్యం అమెరికాలో రోడ్డు ప్రమాదాలు సర్వ సాధారణం కావడం అందు లోనూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారుమృత్యువాత పడడం నిత్య కృత్యమవుతున్నాయి.
తాజాగా అమెరికా లో జరిగిన రో డ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందడం తో ఆయా కుటుంబాల్లో విషాద ఛా యలు అలుముకున్నాయి. మృ తులను న్యూయార్క్‌లోని క్లీవ్ ల్యాండ్ యూనివర్సిటీలో చదు వుతున్న మానవ్ పటేల్ (20), సౌర వ్ ప్రభాకర్(23)గా గుర్తించారు.
ఈ ఘటనపై న్యూయార్క్‌లోని భా రత కాన్సులేట్ సంతాపం వ్యక్తం చేసింది. పెన్సిల్వేనియాలో ఈనెల 10వ తేదీన మానవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్, మరో విద్యార్థి కలిసి కా రులో బయటకు వెళ్లినప్పుడు ప్ర మాదం జరిగింది. వీరి కారు వం తెనను ఢీకొట్టగా కారు నడుపుతు న్న ప్రభాకర్, వెనుక సీటులో కూ ర్చున్న మానవ్ పటేల్ అక్కడికక్క డే దుర్మరణం చెందారు. ముందు సీటులో కూర్చున్న మరో ప్రయా ణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ అతడిని స్థానిక ఆ స్పత్రికి తరలించారు.