బిగ్ బ్రేకింగ్..
ఘోర రోడ్డు ప్రమాదం, తెల్లవారు జామున తెల్లారిపోయిన బతు కులు
BigbrekingRoadaccident : ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యా పేట జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జా మున చోటు చేసుకున్న ఈ దుర్ఘట నలో నలుగురి బతుకులు తెల్లారిపోయాయి. సూర్యాపేట, ఖమ్మం జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసు క లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డీకొనడంతో సంఘటనా స్థలంలోనే నలుగురు దుర్మరణం పాలయ్యారు.
మృతు ల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండగా సూర్యా పేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఘటన జరిగింది. ఒడిశా నుండి హైదరాబా దుకు 32 మంది వలస కూలీలతో వస్తున్న బస్సు ఆగిఉన్న లారీని బలంగా డీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.