Appolice: ప్రజా దీవెన, కోనసీమ జిల్లా: అది అర్ధ రాత్రి చిమ్మ చీకటికి తోడు క్షణా ల మీద నిండు ప్రాణాలు కాపాడా ల్సిన సమయం ఆసన్నమైంది.అతి తక్కువ సమయం, రెండు జిల్లా ల మధ్య దూరo ఇంతలో పోలీసుల సమయస్ఫూర్తి క్షణాల్లో గాలిలో కలవాల్సిన ప్రాణాలు నిలబడ్డాయి.కాపాడాల్సిన ఒక నిండు ప్రాణం ఓ వైపు, ముగ్గురు ఖాకీలు మరోవైపు ఒక్కటైన తరుణంలో అనుస రించా ల్సిన వ్యూహాలు సమయాను కూ లంగా విజయవంతంగా పూర్తి కావ డంతో అంతా ఊపిరి పీల్చుకున్నా రు.
ఇంతకీ ఆ సంగతి ఏమనుకుం టున్నారా సదరు సంఘటనకు సం బంధించి కథాకమీషు ఇలా.సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకుం దామనుకున్న వ్యక్తిని 6 నిమిషాల్లో పోలీసులు కాపాడిన వైనం అంతా అబ్బురపరిచింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కు చెం దిన యువకుడు సెల్ఫీ వీడియో పెట్టి చనిపోయేందుకు సిద్ధ మయ్యాడు. కోన సీమ జిల్లా అయిన విల్లి మండలంకు చెందిన వ్యక్తి ఆర్థి క ఇబ్బందులతో చనిపోదామని నిర్ణయించుకున్నాడు.
ఆ తర్వా త తనకు కావలసిన బంధువులకి సెల్ఫీ వీడియో పెట్టి ఉరి వేసుకుని చనిపోదామని నిర్ణయించుకున్నా డు.అదే సమయంలో పి.గన్న వరం సీ.ఐ భీమరాజుకు వచ్చిన సమా చారం మేరకు వెం టనే అతను ఫో న్ నెంబర్ ని ట్రేస్ చేయడం కోసం ఐటీ కోర్ లో పనిచేస్తున్న జాఫర్ కు పంపించారు. వెంటనే స్విచ్ ఆఫ్ లో ఉన్న మొబైల్ ను క్రెడియన్షి యల్స్ ఉపయోగించి సెల్ ఐడి తో లాస్ట్ లొకేషన్ ను జాఫర్ తెలు సుకున్నారు.
ఆ వెంటనే సదరు లొకేషన్ ను సీ.ఐ భీమరాజుకు షేర్ చేయగా వెం టనే ఆ లొకేషన్ చూసి న సీ.ఐ భీమరాజు కాకినాడ జిల్లా అన్న వరంలో లొకేషన్ రావడంతో వెంటనే అన్నవరం ఎస్సై శ్రీహరిని లైన్ లోకి తీసుకొని పురమాయిం చాడు. అన్నవరం ఎస్ఐ శ్రీహరి వెంటనే వాళ్ళ సిబ్బందిని ఆ లొకే షన్ కి పంపించడంతో పాటు ఆ వీ డియో వెనకాల ఉన్న రూమ్ లాడ్జి రూమ్ లాగా అనిపించడంతో అ న్నవ రంలో ఉన్న లాడ్జి ఓనర్స్ గ్రూ పులో దాన్ని షేర్ చేసి వాళ్లందర్నీ కూ డా అలెర్ట్ చేయడం జరిగింది.
వెంటనే ఒక లాడ్జ్ యజమాని అత డిని గుర్తించి సరిగ్గా ఉరివేసు కొని సమయంలో తలుపు బద్దలు కొట్టి అతన్ని కాపాడాడు.ఈ మొ త్తం వ్యవహారం తంతు అంతా రాత్రి 11:21 నుంచి 11:27 మధ్య లో కేవలం ఆరoటే ఆరు నిమిషాల వ్యవధిలోనే జరగడంతో ఒక నిం డు ప్రాణాన్ని కాపాడడం జరిగింది.
ఈ యొక్క ప్రయత్నంలో విజయం సాధించి ఆ వ్యక్తిని కాపాడిన సీ. ఐ భీమరాజుకికి, అన్నవరం ఎస్.ఐ శ్రీహరికి, ఐ.టీ కోర్ కానిస్టే బుల్ జా ఫర్ కి గ్రామస్తులు, సెటిజెన్స్, ఉన్నతాధికారులు హ్యాట్సాఫ్ చె ప్పారు.