Tirumala Laddu: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తిరుపతి లడ్డూ (Tirumala Laddu) వివాదం సంచలనం రేకెత్తించడంతోపాటు దేశ వ్యాప్తంగా ఆందోళనలు రేకెతిస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) దిష్టి బొమ్మలను హిందువులు ( Hindu People) తగలబెడుతున్నారు. హిందువాదులు సైతం ఈ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మరోవైపు ఇదే అంశంపై సీబీఐ డైరెక్టర్ (CBI Director) ఎక్స్ వేదికగా స్పందించారు. పంది కొవ్వు, ఆవు కోవ్వు కారణంగానే 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం గత ప్రభుత్వంపై ఇదే తరహా ఆగ్రహం సర్వత్ర వెల్లువెత్తుతుందని సీబీఐ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు.