Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chaos in CM’s public meeting: సిఎం బహిరంగ సభలో అపశృతి

--అపస్మారకస్థితిలో గుండెపోటుతో వ్యక్తి మృతి

 

సిఎం బహిరంగ సభలో అపశృతి

–అపస్మారకస్థితిలో గుండెపోటుతో వ్యక్తి మృతి

ప్రజా దీవెన/భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో అపశృతి ( CM KCR’s public blessing public meeting is chaotic) చోటుచేసుకుంది. సోమవారం జరిగిన భారీ బహిరంగ సభలో భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన మెట్టు సత్తయ్య (55) బిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అక్కడి సభా ప్రాంగణం అభిమానులు, కార్యకర్తలతో కిక్కిరిసి పోయింది. అదే సమయంలో మెట్టు సత్తయ్య ఆకస్మికంగా కుప్పకూలి పడిపోయారు. పక్కనే ఉన్న వారు గమనించి ఆ వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాధితుడు గుండె పోటుతో మృతి (The victim died of cardiac arrest on the way to the hospital) చెందినట్లు వైద్యులు తెలిపారు.

సత్తయ్య మృతి చెందడంతో కొద్ది సేపు ప్రాంగణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మృతి చెందిన మెట్టు సత్తయ్య వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారని, ఆయన పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన వారని (They belong to Juluru village of Pochampally mandal) వెల్లడించారు.

అతనికి భార్య ఇంతకు ముందే చనిపోవడంతో, ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించే సత్తయ్య మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.