దద్దరిల్లిన దండకారణ్యం, ఎదురు కాల్పుల్లో 17 మంది మావో యిస్టులు హతం
Chhattisgarhencounter : ప్రజా దీవెన, ఛత్తీస్‌ఘడ్: ఛత్తీ స్‌ఘడ్ లో మరోసారి కాల్పుల మోత మోగింది. బీజాపూర్ జిల్లా లో భద్రతా బలగాలు, మావోయి స్టుల కు మధ్య భారీ ఎదురుకా ల్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణ బస్తర్ ప్రాంతంలో గురువా రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 17 మం ది నక్సలైట్లు హతమయ్యారు. బీజాపూర్ జిల్లా ఊసూర్ పోలీ స్ స్టేషన్ పరిధిలో పూజారీ కాంకేర్, మారేడు బాక ప్రాంత అడవుల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇరుపక్షాల మధ్య కాల్పులు జరు గుతున్నాయి.
ఈ నెలలో ఇది రెండో ఎన్‌కౌం టర్. మూడు జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ),ఐదు బెటాలియన్ల సీఆర్పీఎఫ్, కోబ్రా, సీఆర్పీ ఎఫ్ 229వ బెటాలియన్ బలగాలు నక్సల్స్ ఉన్న ప్రాంతాన్ని చుట్టు ముట్టి కాల్పులు జరిపాయి. ఇదే జిల్లాలో ఈ నెల 12న జరిగిన ఎన్ కౌంట ర్‌లో ఇద్దరు మహిళా నక్సల్స్ తోపాటు ఐదుగురు నక్సలైట్లు మరణించిన విషయం విధితమే.
ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్, మారేడు బాక అటవీ ప్రాంతంలో భద్రతా బలగా లకు మావోయిస్టులకు మధ్య జరి గిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘట నా స్థలంలో తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకు న్నా రు.
సౌత్ బస్తర్ ఏరియాలో మావోయిస్టులు రహస్య సమావేశం ఏర్పా టు చేశారని వచ్చిన సమాచారంతో కోబ్రా, సీఆర్‌పీఎఫ్, ఎస్‌టీఎ ఫ్, డీఆర్‌జీ మూడు జిల్లా లకు చెందిన భద్రతాబలగాలు గురువారం ఉదయం నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్ర తా బలగాలను చూసి మావోయిస్టులు కాల్పులు జరపడంతో, భద్రతా బలగాలు మావోయిస్టులను ముట్టడించాయి.
భద్రతా బలగాలు జరిపిన కాల్పులలో 17మంది మావో యి స్టులు మృతి చెందగా, రెండు ఆయుధాలు లభ్యమైనట్లు పోలీసు ఉన్న తా ధికారులు పేర్కొన్నారు. కాగా మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరి గే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.