Crime News: ప్రజాదీవెన ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలో దారుణాతి దారుణ సంఘటన చోటుచేసుకుంది. వ్యసనాలకు బానిసైన కొడుకును అతి కర్కషంగా హత్య చేసింది ఓ తల్లి. ఆటో డ్రైవర్ కు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. కొడుకును హత్య జేయించిన అనంతరం తల్లి లక్ష్మీ మృతదేహాన్ని ముక్కలుగా నరికి మూటల్లోకి నింపి ఆ తర్వాత పంట కాల్వలో సదరు మూటలు పడేసింది.
కాల్వగట్టుపై రక్తపు మరకలు చూసి స్థానికుల తిడుతూ పోలీసులకు సమాచారమివ్వడంతో పోలీసుల రంగ ప్రవేశం చేసి లక్ష్మిని అరెస్ట్ చేశారు. పోలీసులు విచారణలో లక్ష్మి నేరం అంగీకరించిoది. మృతుడు కందం శ్యామ్ ను ఇద్దరు సోదరులు, మరో వ్యక్తి సాయంతో శ్రీలక్ష్మి హత్య చేయించింది. అన్న సుబ్రహ్మణ్యాన్ని ప్రశ్నించడంతో హత్య సంఘటన వివరాలు వెలుగులోకి వచ్చాయి. శ్యామ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పజెప్పారు.