భేషుగ్గా ఇంట్లోనే గంజాయి సాగు
— రైతును అరెస్టు చేసిన పోలీసులు
ప్రజా దీవెన/ రాజన్న సిరిసిల్ల: విశ్వసనీయ సమాచారం మేరకు సిరిసిల్ల పోలీసులు తనిఖీలు చేయడం ద్వారా గంజాయి తోట పెంపకం గుట్టు రట్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్‌కు చెందిన హైదర్ అనే వ్యక్తి తన ఇంటి వద్ద గంజాయి సాగు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.
గురువారం సిరిసిల్ల రూరల్ సదన్ కుమార్ హైదర్ ఇంటి వద్ద వెళ్లి తోటలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామ చేసి గంజాయి మొక్కలను తరలించారు.
ఈ సందర్భంగా సిఐ సదన్ కుమార్ మాట్లాడుతూ యువత గంజాయి మత్తుకు పదార్థాలకు అలవాటు- పడి భవిష్యత్తు నాశనం చేసుకోకూడదని సూచించారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
మత్తు పదార్థాలను ప్రేరేపిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్‌ఐ ముఖిత్, కానిస్టేబుల్ శ్రీనివాస్, నరేందర్, కార్తీక్, కరీం, అబ్బాస్, రాంప్రసాద్‌లు పాల్గొన్నారు.