Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cumitedsusiad : పెళ్ళిపరేషాన్, పెళ్లి కావడంలేదని యువ వైద్యుడి బలవన్మరణం

పెళ్ళిపరేషాన్, పెళ్లి కావడంలేదని యువ వైద్యుడి బలవన్మరణం

Cumitedsusiad:  ప్రజా దీవెన, హైదరాబాద్: పెళ్లి బాజాలు మొగకముందే చావు డ ప్పులు మోగాయి. వయసు మీద పడు తున్నా వివాహం కావడం లేద ని మనస్తాపం చెందిన ఓ యువ వై ద్యుడు బలవన్మరణానికి పాల్ప డ్డాడు. రైలు పట్టాలపై పడు కుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వి షాదకర సంఘటన సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది.

రైల్వే పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్‌ కు చెందిన ప్రకాష్‌ మాల్‌ కుటుంబంతో సహా సికింద్రాబాద్ లో స్థిరపడ్డారు. ఆయ న చిన్న కుమారుడు పురోహిత్ కిషోర్ ఓ బస్తీ దవాఖానాలో వైద్యు డిగా పనిచేస్తు న్నాడు. పురోహిత్ కు ఇటీవల వివాహం నిశ్చయ మైంది. నిశ్చితార్థం వేడుకను కుటుంబ సభ్యులు ఘనంగా జరిపా రు.

అయితే, పురోహిత్ కు బట్టతల ఉండటం, ఇతర కారణాల వల్ల అమ్మాయి కుటుం బం ఈ వివాహాన్ని రద్దు చేసుకుంది. దీంతో పు రోహిత్ తల్లిదండ్రులు సంబంధాల కోసం వెతుకుతున్నా రు. సరైన సంబంధం దొరకడం లేదు. ఇప్పటికే 34 ఏళ్లు వచ్చాయని, నిశ్చి తా ర్థం అయ్యాక పెళ్లి రద్ద యిందని పురోహిత్ మనస్తాపం చెందాడు.

ఈ ఆవేదనతో బొల్లారం రైల్వేస్టేషన్‌ సమీ పం లోని క్యావలరీ బ్యారక్‌ రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నాడు. లోకో పైలెట్‌ ఈ విషయాన్ని గు ర్తించి జీఆర్పీ పోలీసులకు సమా చా రం అందించారు. గుర్తింపు కా ర్డులోని చిరునామా ఆధారంగా పురో హిత్ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు.