ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట
–18 మంది మృతి, మృతుల్లో ము గ్గురు చిన్నారులు
–మహా కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లు వేసిన రైల్వేశాఖ
–ప్రయాణికులు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట
delhirailwaystationstampede : ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: దేశ రాజ ధాని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఊ హించని పరిణామంగా జరిగిన తొక్కిసలాటలో18 మంది మృత్యు వాత పడ్డారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలి సింది. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల ను సమీపంలోని ఆస్పత్రు ల్లో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. కా నీ మృతుల వివరాలపై రైల్వేశాఖ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఘటనపై మా త్రం అత్యున్నత స్థాయి విచారణకు ఆదే శించింది. తొక్కిసలాటలో మరణాలు చోటుచేసుకున్నట్లు రక్షణ మం త్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ధ్రువీకరిం చారు.
రైల్వే స్టేషన్ తొక్కిసలాట కథా కమీషు.. దేశ రాజధాని ఢిల్లీలో ఘో ర ప్రమాదం జరిగింది. శనివా రం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉ న్నట్టుండి కలకలం రేగింది. న్యూఢి ల్లీ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల మ ధ్య ఊహించని విధంగా తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాట లో18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారు లు ఉండగా, పదుల సంఖ్యలో ప్రయా ణికులు గాయపడ్డారు. క్షత గాత్రులను సమీపంలోని ఆస్పత్రు ల్లో చేర్పించి చికిత్స అందజేస్తున్నా రు. తొక్కిలాసట మూలంగా ఢిల్లీ రైల్వే స్టేషన్ లో పరిస్థితి భయాన కంగా మారింది.
ప్లాట్ ఫామ్ పై ప్ర యాణికులు చెల్లా చెదురుగా పడి వున్న దృశ్యాలు హృదయవిధార కంగా కనిపించాయి. తొక్కిస లాటలో మరణాలు చో టుచేసు కున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, దిల్లీ లెఫ్టినెంట్ గవ ర్నర్ వీకే సక్సేనా ధ్రువీకరించారు. తొక్కిస లాట నేపథ్యంలో రద్దీని నివారిం చేందుకు నాలుగు ప్రత్యేక రైళ్లను ఏ ర్పాటు చేశామని రైల్వే మంత్రి అ శ్వినీ వైష్ణవ్ తెలిపారు. అనూహ్య రద్దీ కారణంగా తొక్కిస లాట జరిగినట్లు వెల్లడించారు. అటు, ప్రధా నమంత్రి నరేంద్ర మోడీ ఈ సంఘ టనపై విచారం వ్యక్తం చేశారు.
14వ నంబరు ప్లాట్‌ఫాంపై ప్రయాగ్ రాజ్ ఎక్స్‌ప్రెస్ నిలిచి ఉండడం తో మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడకు చేరుకున్నారు. స్వ తంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజ ధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆల స్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయా ణికులు అదే సమయం లో 12, 13, 14 నంబరు ప్లాట్ ఫాం లపై ఉన్నారు. దీంతో ఒక్కసారి గా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసినట్లు భావిస్తు న్నారు.ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగు తున్న మహా కుం భమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. గత నెలలో ప్రారంభమైన కుం భమేళా ఈ నెల 26న ముగియనుంది. కుంభమేళా ముగింపు దగ్గర పడుతున్న క్రమంలో ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానా ల కోసం జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు.
ఈ క్రమంలోనే అటు ప్రయాగ్ రాజ్ లోనే కాకుండా ప్రయాగ్ రాజ్ కు దారి తీసే రహదా రులు, రైల్వే లైన్లు, విమాన సర్వీ సులు సైతం రద్దీ తో కిటకిటలాడు తున్నాయి. ఈ క్రమంలోనే శనివా రం రాత్రి ప్రయాగ్ రాజ్ వెళ్లేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో నెలకొన్న రద్దీ కారణంగానే ప్రయాణికుల మ ధ్య తోపులాట జరిగిందని సమాచారం.