Died due to family quarrels: కుటుంబ కలహాలతో కడతేర్చాడు
-- భార్య, బావమర్డిని చంపిన వైనం -- తిరుపతిలో జరిగిన దుర్ఘటన
కుటుంబ కలహాలతో కడతేర్చాడు
— భార్య, బావమర్డిని చంపిన వైనం
— తిరుపతిలో జరిగిన దుర్ఘటన
ప్రజా దీవెన/తిరుపతి: పక్క రాష్ట్రం మహారాష్ట్ర నుంచి తీర్థ యాత్రకు విచ్చేసిన ఓ వ్యక్తి పక్కా ప్రణాళికతో ఇద్దరిని హతమార్చిన సంఘటన తిరుపతి వేదికగా (The incident that killed the two took place in Tirupati) జరిగింది. మహారాష్ట్ర నుంచి తిరుమలకు తీర్థ యాత్ర కోసం వచ్చిన ఓ వ్యక్తి తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో భార్య, బావమరిదిని హత్య చేసాడు.
ప్రాథమిక సమాచారం మేరకు ఆర్థిక సమస్యల తో పాటు కుటుంబ కలహాలు ప్రధాన కారణాలుగా (Along with financial problems, family conflicts are the main reasons) పోలిసులు భావిస్తున్నారు. ఆ మేరకు పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన యువరాజ్ అనే నిందితుడు (The accused is Yuvraj from Nanded district of Maharashtra) తిరుపతికి తన భార్య నర్వాది మనీషా (25), వారి ఇద్దరు పిల్లలు, అతని బావమరిది ఎన్. హర్షవర్ధన్ (27) తో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోసం వచ్చిన కుటుంబం కపిల తీర్థం సమీపంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో చేరింది.
తెల్లవారుజామున 2 గంటలకు జరిగిన ఈ సంఘటన కు సంబందించి యువరాజ్ తన భార్య , బావమరిదిని కత్తితో పొడిచి ( He stabbed his wife and brother-in-law) ఆ తర్వాత హోటల్ సిబ్బందిని షాక్ కు గురిచేసి అక్కడి నుంచి పారిపోయాడు. యువరాజ్ తన దుస్తులపై రక్తపు మరకలతో ప్రాంగణం నుండి వెళ్లిపోవడాన్ని గమనించిన హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.