హిజ్రా లీడర్ దారుణ హత్య
ప్రజాదీవెన, నెల్లూరు: జిల్లాలోని కోవూరు నియోజకవర్గం కొడవలూ రు మండలం టపాతోపు వద్ద దారుణం చోటుచేసుకుంది. హిజ్రా నాయకురాలు హాసినిని రెండు కార్లలో వచ్చి కత్తులతో పొడిచి దుం డుగులు పరారయ్యారు.108లో నెల్లూరు అపోలోకు తరలించగా, అక్కడి డాక్టర్లు పరిశీలించి అప్పటికే హాసిని మృతి చెందారని తెలి పారు.
పార్లపల్లిలోని గుడిలో పూజలు నిర్వహించి, తిరిగి వస్తుండగా దుం డగులు దాడికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. హాసినీకి తి రుపతి – నెల్లూరులో అధికసంఖ్యలో హాసిని అనుచర ట్రాన్స్ జండ ర్స్, హిజ్రాల మద్దతుదారులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hijra leader brutally murdered