ఉగ్రవాదానికి ఉరఫ్ పాకిస్థాన్
— పాకిస్తాన్ మాటలు ఎట్టి పరిస్థి తుల్లో నమ్మొద్దు
— ఐఎస్‌ఐ ప్రపంచ ఉగ్రవాదానికే కేంద్రబిందువు
–పశ్చిమ సరిహద్దు నుండి భారత్ కు సైనిక శక్తిగా నిలుస్తాం
–బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచ లన ప్రకటన
IndiapakisthanWar: ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: దాయాది పాకిస్తాన్ దేశం పక్కలో బల్లెంలా తయారై పాకిస్తాన్ సైన్యంతో పోరా డుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన వెలువరించిం ది. రేపు ( సోమవారం) పాకిస్తాన్ తో భారత్ చర్చలు జరపనున్న నే పథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన సంచలనంగా మారింది. చర్చల తర్వాత పాకిస్తాన్ పై భార త్ నిర్ణయాత్మక చర్య తీసుకుంటే, దానికి తాము మద్దతు ఇస్తామని వెల్లడించింది.
భారతదేశానికి సైనిక శక్తిగా నిలుస్తా మని, పశ్చిమ సరిహద్దు నుంచి పాకిస్తాన్‌పై దాడి చేస్తామని స్పష్టం చేసింది. పాకిస్తాన్ శాంతి, కాల్పు ల విరమణ ప్రకటనలను మోసంగా అభివర్ణించిన బలూచ్ లిబరేష న్ ఆర్మీ, ఇది పాకిస్తాన్ వ్యూహాత్మక చర్య అని పేర్కొంది. పాకిస్తాన్ మా టలకు బలైపోవద్దని, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని భార త్‌కు విజ్ఞప్తి చేసింది.
పాకిస్తాన్‌ను ఉగ్రవాద కర్మాగారంగా అభివర్ణించిన బలూచ్ లిబరేష న్ ఆర్మీ, పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎ స్‌ఐ ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్ర బిందువు అంటూ ఘాటుగా స్పం దించింది. పాకిస్తాన్ ఉన్నంత కా లం ఈ ప్రాంతంలో ఉగ్రవాదం, అస్థిరత కొనసాగుతాయని బలూచ్ లిబరే షన్ ఆర్మీ హెచ్చరించింది.
పాకిస్తాన్‌పై దాడి చేయాలని నిర్ణ యించుకుంటే పశ్చిమ సరిహద్దు నుండి సైనిక మద్దతు అందించడానికి సిద్ధంగా ఉన్నామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది.