బిగ్ బ్రేకింగ్, సజీవ సమాధికి వ్యక్తి యత్నం, అడ్డుకున్న పోలీసులు
Jeevasamadhi : ప్రజా దీవెన, ప్రకాశం జిల్లా: సజీవ సమాధికి యత్నించిన వ్య క్తిని పోలీసులు అడ్డుకున్న సం ఘ టన ప్రకాశం జిల్లాలో చోటు చేసు కుంది. తాళ్లూరు మండలంలోని విఠలాపురానికి చెందిన మాజీ స ర్పంచ్ కైపు అంజిరెడ్డి కుమారుడు కోటిరెడ్డి పన్నెం డేళ్ల క్రితం ఊరి శివా రులోని తన పొలంలో భూదేవి ఆలయాన్ని నిర్మించాడు. ఇటీవల ఆలయం ముందు పెద్ద గొయ్యి తవ్విన ఆయ న వారం రోజులుగా ఆ గొ య్యిలోకి వెళ్లి పైన రేకు కప్పుకొని ధ్యానం చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఉగాది రోజున సజీవ సమాధి కావాలని నిర్ణయించుకు న్నాడు. ఆది వారం తెల్లవారుజామున కుమా రుడితో కలిసి ఆల యం వద్దకు చేరుకున్నాడు.ఆలయంలో ప్రత్యేక పూజల అనం తరం కోటిరెడ్డి గొయ్యిలోకి దిగి ధ్యా నంలో మునిగిపోయాడు. వెంట వె ళ్లిన కుమారుడు ఆ గొయ్యిపై రేకు ఉంచి దానిపై మట్టిపోసి పూడ్చేశా డు. విషయం తెలిసిన కోటిరెడ్డి తం డ్రి అంజిరెడ్డి గ్రామస్థులతో కలిసి ఆ లయం వద్దకు చేరుకుని కుమారు డిని బయటకు రావాలని కోరా రు. అయితే తన ధ్యానానికి ఎవరూ ఆటంకం కలిగించవద్దని కోటిరెడ్డి కోరాడు.
మరోవైపు, సజీవ సమాధికి సంబం ధించిన సమాచారం అందుకున్న తాళ్లూరు పోలీసులు ఘటనా స్థ లానికి చేరుకొని స్థానికుల సాయం తో కోటిరెడ్డిని బయటకు తీశారు. అయితే, వారు వెళ్లిపోయిన త ర్వా త మరోమారు ఆయన గోయ్యిలోకి దిగి ధ్యానం చేశాడు. చివ రికి కు టుంబ సభ్యులు, స్థానికులు నచ్చ జెప్పడంతో మధ్యాహ్నం ఇంటికి చేరుకోవడంతో అంతా సద్దుమణిగింది.