Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Living Grave : సజీవ సమాధి, భార్యతో అక్రమ సంబంధం నెపంతో గోతిలో పెట్టి

Living Grave : ప్రజా దీవెన హర్యానా: భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కోపంలో ఓ వ్యక్తి వింతైన కొత్త ప్ర యోగం చేశాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టు కున్నా డన్న కారణంతో ఓ యోగాటీచర్‌ ను ఓ వ్యక్తి ఏడడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టిన సంఘటన
హర్యానాలోని చక్రి దాద్రిలో జరి గింది. బాధితుడు జగదీప్ రోహ్‌ తక్‌లోని ఓ ప్రైవేటు యూనివ ర్సిటీలో యోగా టీచర్ కాగా ఆయ నను కిడ్నాప్ చేసిన నిందితుడు ఏడుగుల గొయ్యి తీసి అందులో ఆయనను సజీవంగా పాతిపెట్టా డు. ఆలస్యంగా వెలుగులోకి రావ డంతో మూడు నెలల తర్వాత ఈ నెల 24న జగదీప్‌ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.

పోలీసుల కథనం ప్రకారం డిసెంబర్ 24న జగదీప్‌ ఇంటికి వస్తుండగా నింది తుడు ఆయనను కిడ్నాప్ చేశాడు. కాళ్లు, చేతులు కట్టేశాడు. ఆపై అర వకుండా నోటికి ప్లాస్టర్ వేశాడు. అనం తరం ఓ నిర్మానుష్య ప్రాంతా నికి తీసుకెళ్లి అప్పటికే సిద్ధం చేసిన గోతిలో ఆయనను సజీవంగా పాతి పెట్టాడు. జగదీప్ కనిపించడం లే దంటూ కేసు నమోదు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా ఆయన కాల్ రికార్డుల ను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నింది తులు ధర్మపాల్, హర్‌దీప్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

విచారణ సందర్భంగా నిందితుడు భయంకరమైన నిజాలను వెల్లడిం చాడు. నిందితుడు ఉంటున్న భవ నంలోనే జగదీప్ అద్దెకు ఉంటు న్నాడు. ఈ క్రమంలో నిందితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతిమంగా ఇది ఆయన హత్యకు దారితీసింది.