manasadevitempleharidwar : మనసాదేవి మానసదేవి ఆలయంలో మారణహోమం, హరిద్వార్ విషాదఘటనలో ఆరుగురు మృత్యువాత
manasadevitempleharidwar: ప్రజా దీవెన, ఉత్తరా ఖండ్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వా ర్‌లో ని మానసాదేవి ఆలయంలో మారణహోమం జరిగింది. ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఘోర విషాద ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డా రని అధికారులు తెలిపారు. దర్శనానికి భారీగా భక్తులు తరలిరా వడంతో తొక్కిసలాట కు దారితీసిన ఈ ఘటనలో ఇప్ప టి వరకూ ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్రగాయాల య్యాయి.
శ్రావణమాసంలో కన్వర్ యాత్రికు లు పవిత్రగంగా జలాలను తీసుకె ళ్లేందుకు హరిద్వార్‌కు తరలివస్తుం డడo, ఈ సమయంలో గంగా తీరం భక్తులతో నిండిపోవడం అనవాయితీ. నదికి సమీపంలోని కొండపై ఉ న్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకోవడం కూడా తెలిసిందే.
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ మానసాదేవి ఆలయoలో ఘోర విషా దం చోటుచేసుకుంది. హరిద్వార్‌లోని మా నసాదేవి ఆలయంలో ఆదివారం ఉ దయం ఈ తొక్కిసలాట ఘటన చో టుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆ రుగురు భక్తులు ప్రాణాలు కోల్పో గా పలువురు గా యపడ్డారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక, శ్రావణమాసం కావడంతో అమ్మ వారి దర్శనానికి భక్తులు పోటె త్తారు. దీంతో మెట్లమార్గం వద్ద తొక్కిస లాటకు దారితీసింది.
ప్రమాదం గురించి సమాచారం అం దుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ లు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయ పడిన వారిని హుటాహుటిన చికిత్స కో సం ఆసుపత్రికి తరలిం చా రు. ఆలయానికి వెళ్లే రోడ్డులోని మెట్లపై చోటు చేసుకుంది. గ ర్వాల్ డివిజన్ క మిషనర్ వినయ్ శంకర్ పాండే మాట్లాడుతూ ప్రమాదం లో ఆరుగురు మృతిచెందినట్టు ధ్రువీకరించారు.
మానసాదేవి ఆలయంలో భారీగా భక్తులు తరలి రావడంతో ఈ ఘ టన జరిగిందని ఆయన తెలిపారు. తాను ప్రస్తుతం సంఘటన స్థ లానికి వెళ్తున్నట్టు కూడా చెప్పారు. శ్రావణ మాసం కావడంతో ఆల యానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రావణంలో హరిద్వార్‌లోని గంగా తీరంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కన్వర్ యాత్రికు లు సైతంగంగా నది నుంచి పవిత్ర జలాన్ని తీసుకెళ్లేందుకు ఇక్కడ కు వస్తారు.
ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఉత్తరా ఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు.తొక్కిసలాటపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన సహాయక చర్యలు వేగవంతం చే యాలని స్థానిక పోలీసులు, అధికా ర యంత్రాంగాన్ని ఆదేశించారు. ‘‘హరిద్వార్ లోని మానసా దేవి ఆల య మెట్ల మార్గంలో తొక్కిస లాట జరిగిన వార్త తీవ్ర విచారకరం.. స్థా నిక పోలీసులు, ఇతర రెస్క్యూ బృందా లు సంఘటన స్థలానికి చే రుకుని సహాయ చర్యలు చేపట్టా యి. స్థానిక అధికార యంత్రాంగం తో నిరంతరం సంప్రదించి పరిస్థితిని దగ్గర నుంచి గమనిస్తున్నాను. గా యపడిన భక్తులు క్షేమం కోసం అ మ్మవారిని ప్రార్థిస్తున్నానని సీఎం పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ చేశారు.