Misfortune haunts and death: దురదృష్టం వెంటాడి దుర్మరణం
-- ప్రమాదవశాత్తు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు -- ఒకరు తాటిచెట్టు పై నుండి పడి, మరొకరు చెర్వులో పడి మృత్యువాత
దురదృష్టం వెంటాడి దుర్మరణం
— ప్రమాదవశాత్తు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు
— ఒకరు తాటిచెట్టు పై నుండి పడి, మరొకరు చెర్వులో పడి మృత్యువాత
ప్రజా దీవెన/ హైదరాబాద్: తెలంగాణలో దురదృష్టం వెంటాడి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. రెండు సంఘటనలు వేర్వేరు ప్రాంతాల్లో జరిగినా దురదృష్టం కొద్దీ ప్రాణాలు కోల్పోయారు. ఒకరు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని చిన్నేముల గ్రామంలో తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడు గ్రామానికి చెందిన బొల్లికొండ సైదులు (38) వృత్తిరీత్యా తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారడంతో తాటిచెట్టు పై నుండి ఒకేసారి గా కింద పడడంతో అక్కడికి అక్కడే మృతిచెందాడు. కాగా మరొకరు పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోఈతకు వెళ్లి యువకుడు చెరువులో గల్లంతయ్యారు. సరదాగా ఈత కోసం వెళ్లిన ఇద్దరు యువకులలో ఒక్కరు నీటిలో మునిగి గల్లంతయ్యారు. మంథని మండలం బోయిన్ పేట గ్రామానికి చెందిన ఆకుల భవాని శంకర్ (23) అతని స్నేహితుడు ఇద్దరు మంథని పట్టణంలోని బన్నచెరువులో సరదాగా ఈతకు వెళ్లారు. చెరువు మధ్యలోకి వెళ్ళగానే వారిలో ఆకుల భవాని శంకర్ చెరువులో మునిగి గల్లంతైనట్లు గ్రామస్తులు తెలిపారు.మరో యువకుడు సురక్షితంగా బయటపడగా భవాని శంకర్ ఆచూకి కొరకు గ్రామస్తులు అగ్గిమాపక సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. చీకటి పడడంతో అంతరాయం ఏర్పడి వెనుదిరిగామని, ఎంత వెతికినా లాభం లేకుండా పోయిందని గ్రామస్థులు తెలిపారు.