Mlc Kavitha thihar jail : ఏకంగా నెలరోజులు ఎమ్మెల్సీ కవిత జైలులోనే
--రిమాండ్ ను పొడిగించిన డిల్లీ అవెన్యూ కోర్టు
ఏకంగా నెలరోజులు
ఎమ్మెల్సీ కవిత జైలులోనే
–రిమాండ్ ను పొడిగించిన డిల్లీ అవెన్యూ కోర్టు
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్న ఎమ్మెల్సీ కవితకు ( mlc Kavitha ) విడత ఎదురు దెబ్బ తగిలింది. ఈ దఫా ఏకంగా నెల రోజుల పాటు జ్యుడీషియల్ రిమాం డ్‌ను పొడిగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
లిక్కర్ స్కాం వ్యవహారంలో ఆమె పై ఈడీ, సీబీఐ వేర్వేరు కేసులు నమోదు చేసి అభియోగాలు మోపగా నాటి నుంచి నేటి వరకు ఆమె జైలు జీవితమే గడుపుతున్న విషయం విదితమే. ప్రస్తుతం ఆమె తీ హర్ జైలులో (thihaar jail) నేడు ఈడీ మనీ లాండరింగ్ కేసులో కస్డడీ ముగియగా ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో వర్చువల్‌గా హాజ రు పరిచారు.
విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆమె రిమాండ్‌ను పొడగించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిమాండ్ సోమవారంతో ముగియడంతో ఈ నేపథ్యంలో ఆమెను కోర్టు ముం దు హాజరుపర్చగా రౌస్ అవెన్యూ కోర్టు ( rouse Avenue cou rt) ఈడీ కేసులో కవితకు జులై 3 వరకు ఎకంగా నెల రోజుల పాటు జ్యుడీషి యల్ రిమాండ్‌ను పొడి గిస్తూ తీర్పు నిచ్చింది.
ఇప్పటి వరకు 14 రోజుల పాటు మాత్రమే కస్టడీ పొడగించగా తాజా గా నెల రోజుల పాటు కస్టడీ పొడగిస్తూ న్యాయస్థానం తీర్పుని వ్వ డం గమనార్హం. ఇదిలా ఉండగా సీబీఐ కేసులోనూ నేటితో ఆమె కస్ట డీ ముగియనుంది. దీంతో నేడు మధ్యాహ్నం 2 గంటలకు కస్టడీ పొడగింపుపై విచారణ జరుగ నుండగా సీబీఐ ( cbi ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను అధికారులు హాజరుపర్చనున్నారు.
లిక్కర్ స్కాం కేసులో భాగంగా మార్చి 15న ఈడీ కవితను అదుపు లోకి తీసుకుంది. మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైలులో ఉ న్నా రు. ఆమెపలు మార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా న్యా యస్థానం తిరస్క రించింది.
సాక్షులను ప్రభావితం చేస్తారనే సీబీఐ, ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ వచ్చిన న్యాయస్థానం బెయిల్ పిటి షన్లు తరిస్కరించింది.అయితే ఇది ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసని రాజకీయ కుట్రలో భాగంగా తనపై తప్పుడు కేసులు పెట్టారని కవిత ఆరోపిస్తున్నారు.