జైలులో ముంబై బాంబు పేలుళ్ల దోషి హత్య
ప్రజా దీవెన, ముంబై: దేశంలోనే సంచలనం సృష్టించిన ముంబై బాంబు పేలుళ్ల ( Mumbai bomb blasts) కేసులో దోషి మున్నా అలియాస్ మహ్మద్ అలీఖాన్ జైలులో దారుణహత్యకు గుర య్యా రు. బాత్రూమ్ ప్రాంతంలో స్నానం చేయడంపై ఇతర ఖైదీలతో ము న్నా (munaa) కు వాగ్వాదం చెలరేగిందని సమాచారం.
దీంతో కొందరు ఖైదీలు అతణ్ని రాడ్ తో తలపై కొట్టడంతో చనిపోయి నట్లు పోలీసులు తెలిపారు. 1993 మార్చి 12న ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 257మంది మరణించిన విషయం అందరికి తెలిసిందే.ఈ కేసులో దోషి మున్నా కొల్హాపూర్ సెంట్రల్ జై లు ( kolhapur Central Jail) లో జీవిత ఖైదు అనుభవిస్తు న్నారు.