Road Accident : ప్రజా దీవెన కర్ణాటక: కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కలబురగి జి ల్లా లో ఆగిఉన్న ట్రక్కును ఓ వ్యాను బ లంగా ఢీ కొట్టిన ఘటనలో ఐదు గు రు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయాలపాలయ్యారు.
కలబురగి పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం శనివారం తెల్లవారు జామున 3:30 గంటల ప్రాంతంలో జిల్లాలోని నెలోగి క్రాస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 10 మంది గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందుకున్న కలబురగి పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేప ట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమి త్తం కలబురగి ఆసుపత్రికి తరలిం చారు. మృతులను బాగల్‌కోట్ జి ల్లా వాసులుగా గుర్తించారు. ఈ ఘ టనపై నెలోగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు కలబురగి పోలీసులు తెలిపారు.