Road Accident: ప్రజా దీవెన, కోల్ కత్తా: మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కుమార్తె సనా కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు ఢీకొట్టింది. కోల్‌కతా లోని డౌమండ్ హార్బర్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
కోల్‌కతా నుంచి రాయ్‌చక్ వెళ్తున్న బస్సు.. బెహలా చౌరస్తాలో సనా గంగూలి కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ సమయంలో కారును డ్రైవర్ నడుపుతుండగా.. సనా పక్క సీట్లో కూర్చుని ఉన్నారు. ప్రమాదం తర్వాత బస్సు వేగంగా వెళ్లిపోగా.. కారు డ్రైవర్ దాన్ని వెంబడించారు. కొంత దూరం వెళ్లాక బస్సును అడ్డగించి గంగూలీ కుమార్తె పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.