రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదo
— ఐదుగురు దుర్మరణం.. ఆరుగురికి తీవ్ర గాయాలు
ప్రజా దీవెన/రాజస్థాన్: రాజస్థాన్ రాష్ట్రం లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద సంఘటన చోటు చేసుకుంది. హిందౌన్ రోడ్డులో ఓ టెంపోను బస్సు ఢీకొట్టగా ఐదుగురు దుర్మరణం చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహువ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని స్ధానిక పోలీసులు తెలిపారు.
టెంపోను ఓవర్ టెక్ చేసే సమయంలో బస్సు ఢీకొట్టిందని సమాచారం. టెంపోలో ప్రయాణిస్తున్న ఆరుగురు సైతం గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో జైపూర్‌కు తరలించారు.
కరౌలిలోని కైలా దేవి ఆలయాన్ని సందర్శించి టెంపోలో మెహ్వాకు వెళ్తున్న సమయంలో వస్తుండగా మహ్వా-హిందౌన్ హైవేపై ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
యాత్రికులందరూ కరౌలీలోని హిందౌన్ సిటీ నుంచి మెహ్వాకు టెంపోలో తిరిగి వస్తుండగా రాజస్థాన్ లోక్ పరివాహన్ సేవా ఆటో రిక్షాను ఢీకొట్టగా టెంపో నుజ్జునుజ్జు అయ్యిందని పోలీసులు తెలిపారు.