Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Siriyatragedy : విషాదం, సిరియాలో మళ్లీ చెల రేగిన మారణహోమం

విషాదం, సిరియాలో మళ్లీ చెల రేగిన మారణహోమం

Siriyatragedy : ప్రజా దీవెన, సిరియా: సిరియా మాజీ అధ్య క్షుడు బషర్ అస ద్,విదేశీ ల తిరుగుబాటుతో స్థానికంగా హిం స చెలరేగింది, భద్రత దళాలు అస ద్, అనుకూల వాదుల మధ్య తీవ్ర ఘర్షణ లు ప్రతికాల దాడులు చో టుచేసుకుంటున్నాయి. గడిచిన రెండు రోజులుగా జరుగుతున్న దా డుల్లో దాదాపు 1,000 మందికి పై గా ప్రాణాలు కోల్పోయినట్లు అక్క డి అధికారులు అంచనా వేస్తు న్నారు. రాజకీయ సంక్షోభం, అంత ర్యుద్దంతో అల్లకల్లోలంగా మారిన సిరియాలో అతిపెద్ద మారణకాండ చోటు చేసుకుంది.

భద్రతా దళాలు, బహిష్కరణకు గురైన ప్రెసిడెంట్ బషర్ అసద్, విధేయుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు కాస్తా హింసా కాండకు దారి తీసింది. 14 ఏళ్ల సిరియా సంక్షోభంలో ఇంత దారుణమైన మా రణకాండ చోటు చేసుకోవడం ఇదే తొలిసారని తెలుస్తుంది. గురువా రం మొదలైన ఘర్షణలు మరింతగా ముదరడం తో సిరియాలో ఏర్ప డిన కొత్త సర్కారుకు ఇబ్బందిగా మారింది. అసాద్‌ను పదవీచ్యు తుడ్ని చేసిన త ర్వాత తిరుగు బాటుదారులు సిరియాలో అధికారా న్ని హస్తగతం చే సుకున్నారు. అయితే బషార్ అస ద్ విధేయులే ఈ హింసాకాండ కు బాధ్యత వహించాలని, ఇలాంటి వ్యక్తిగతమైన చర్యలు తగదని కొత్త ప్రభుత్వం అంటోంది.

శుక్రవారం ప్రభుత్వానికి విధేయులైన సున్నీ ముస్లింలు ఆయుధాలు చేపట్టి అసద్ వర్గానికి చెందిన మైనార్టీలైన అలావైట్ గ్రూపుపై దాడు లకు తెగ బడ్డారు. దశాబ్దాలుగా అలావైట్ ప్రాంతం అసాద్‌కు సపోర్ట్ బేస్‌గా ఉంటూ వస్తోంది. ఈ ప్రాంతంపై సు న్నీ ముస్లింలు దాడి చేసి అలా వైట్లను దారుణంగా చంపేశారు. దుకాణాలు, ఇండ్లలోకి చొర బడి దొరికిన వారిని దొరికినట్లు కాల్చే శారు. వీధుల్లో, రోడ్లపై ఈ కా ల్పుల కారణంగా వందలాది మంది మృతి చెందారు. పైగా అలావైట్ల ఇండ్ల లో కి చొరబడి సామాన్లు లూటీ చేశారు.

అనంతరం ఇండ్లను తగలబెట్టి నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతు న్నా రు. ఇక బనియాస్ ప్రాంతంలో కూడా హింసాకాండ చెలరేగింది.
అక్క డ ప్రతీ వీధిలో, రోడ్లపై, ఇండ్ల పైకప్పులపై శవాల గుట్టలు పేరు కొని పోయాయి. వాటిని తీసుకొని పోవడానికి కూడా సున్నీ ముస్లిం లు ఒప్పుకోలేదని తెలిసింది.