ten people అయ్యో…పది మంది అసువులుబాసారు..!
మధురై రైలు ప్రమాదంలో మృత్యుఘోష -- ఇరువై మంది పైగా క్షతగాత్రులు
అయ్యో…పది మంది అసువులుబాసారు..!
–మధురై రైలు ప్రమాదంలో మృత్యుఘోష
— ఇరువై మంది పైగా క్షతగాత్రులు
ప్రజా దీవెన/ మదురై: తమిళనాడు రాష్ట్రం లోని మధురైలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మొత్తం పది మంది మృత్యువాత పడ్డారని రైల్వే అధికారులు వెల్లడిస్తున్నారు. మదురై స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు కోచ్‌లో చోటుచేసుకున్న ప్రమాదoలో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.
లక్నో నుండి రామేశ్వరం వెళ్తున్న రైలు ప్యాసింజర్ కోచ్‌లో మంటలు చెలరేగడంతో 10 మంది మరణించారని, 20 మంది గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుదక్షిణ రైల్వే వర్గాలు ప్రకటిoచాయి. ఆయితే లక్నోనుంచి 65మంది ప్రయాణికులతో ఒక ప్రైవేట్ పార్టీ రైలులోని టూరిస్ట్ కోచ్ ఎక్కింది.
రైలు నెంబర్ 16730 శనివారం తెల్లవారుజామున 3.47గంటలకు మధురై చేరుకోగా బుక్ చేసిన టూరిస్టు రైల్వే స్టేషన్ లో పార్కు చేశారు. అయితే కొంతమంది టీ, స్నాక్స్ చేసేందుకు ఎల్పీజీ సిలిండర్లను ఉపయోగించగా కోచ్ లో మంటలు చెలరేగాయి.
ఈ కోచ్‌లో ప్రయాణికులు అక్రమంగా గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్తున్నారని తెలిపారు. ఈ ప్రైవేట్ కోచ్ మినహా మరే ఇతర కోచ్‌కు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.