-
- చెన్నై: తమిళ సినీ రంగంలో విషాధ ఛాయలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం ప్రముఖ తమిళ సినీ నటుడు డానియల్ బాలాజీ గుండెపోటుతో మృతి చెందారు. 48 ఏళ్ల వయసున్న డేనియల్ బాలాజీ శుక్రవారం చాతిలో నొప్పి రావడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి డేనియల్ బాలాజీ మృతి చెందారనీ డాక్టర్లు ధ్రువీకరించారు. డేనియల్ బాలాజీ తన కెరీయర్ ను మరుదునయగం అనే కమలహాసన్ సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్ గా ప్రారంభించారు. అయితే ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. పలు తెలుగు సినిమాల్లోనూ విలన్ గా నటించారు. కాగా తనకి పేరు తెచ్చింది మాత్రం రాధిక శరత్ కుమార్ టీవీ సీరియల్ చిత్తి గా చెప్తారు. విభిన్న క్యారెక్టర్లలో సైతం ఇమిడిపోయే నటుడిగా పేరుపొందారు
.