Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

thief police Uttar Pradesh : దొంగతనానికొచ్చి దొరలా పడుకున్నాడు

--చల్లని ఏసీ గాలిలో ఆదమరిచి నిద్రించిన దొంగ --లేచి చూసే సరికి పొద్దున్నే పోలీసులకు చిక్కిన వైనం

దొంగతనానికొచ్చి దొరలా పడుకున్నాడు

–చల్లని ఏసీ గాలిలో ఆదమరిచి నిద్రించిన దొంగ
–లేచి చూసే సరికి పొద్దున్నే పోలీసులకు చిక్కిన వైనం

ప్రజాదీవెన, ఉత్తరప్రదేశ్: దొరికింది దోచుకుని దొరలా బతుకుదామ ని అనుకున్న దొంగకు ( theif) చేదు అనుభవం చూస్తే పొట్ట చెక్కల య్యే నవ్వును ఆపుకోలేరు. దొంగతనానికి ఓ ఇంట్లోకి చొరబడి దొరి కిందల్లా దోచుకుందామని ఆశతో వెళ్లిన సదరు దొంగకు ఇంట్లోని చల్ల ని ఏసీ గాలి ఆదమర్చి నిద్రపోయే విధంగా చేసింది.

ఇంకేముంది పొద్దుపొద్దున్నే పోలీసుల (police) చేతుల్లో చిక్కిన దొంగనే ఆశ్చ ర్యానికి గురిచేసే విచిత్ర సoఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళి తే లక్నో లోని ఓ డాక్టర్ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ మంచి ఏసీ కూలిం గ్ ఉండటంతో అక్కడే నిద్ర పోయి పొద్దు పొద్దుగాల పోలీసులకు చిక్కాడు.

ఉత్తర ప్రదేశ్ లోని ఘాజీ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆశ్చర్య కర ఘటన వెలుగుచూ సింది.లక్నో నగరంలోని ఇందిరానగర్ సెక్టర్–20లో సునీల్ పాండే అనే వైద్యుడు ( doctor) నివాసం ఉంటు న్నాడు. బల రామ్‌పూర్ హాస్పిటల్‌లో పనిచేసే డా.పాండే ప్రస్తుతం వారణాసిలో డ్యూటీ చేస్తున్నారు.

దీంతో లక్నో  (lakno) లోని ఇల్లు ఖాళీగా ఉంచారు. అయితే, పాండే ఇంటి తలుపు తెరిచి ఉండటం చూసి ఇరుగుపొ రుగు వారికి అనుమానం కలిగింది. వెళ్లి చూడగా లోపల ఓ దొంగ గుర్ర తీస్తూ కనిపించాడు. ఇళ్లంతా చింద రవందరగా ఉన్నాయి. అతని పక్క నే రెండు గోనె సంచులు సామాను తో నింపి ఉన్నాయి. దీంతో, వారు వెంటనే సదరు ఇంటి ఓనర్‌తో పాటు పోలీసులకు సమాచారం అందించారు.

ఆశ్చర్యకరమైన విష యమేమిటంటే పోలీసులు రంగ ప్రవేశం చేసి అయ్యగారిని లేపే వరకు ఆ దొంగ పడుకునే ఉన్నాడు. లేవగానే పోలీసులను చూసి ఒక్క సారిగా బిత్తరపోయాడు. తెల్లవారుజాము న సదరు దొంగ తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. ఇన్వర్టర్ బ్యాటరీ, గీజర్, పాత్రలు, మరికొన్ని వస్తువు లను రెండు బ్యాగుల్లో సర్దిన్నట్లు వెల్లడించారు.

నిందితుడు ఇంట్లో కనిపించిన ప్రతి వస్తువును దొంగిలించుకుపోయే ప్రయత్నం చేశాడని వివరించారు. తలుపు, కప్ బోర్డులు పగలగొట్టా డని గ్యాస్ సిలిండర్, వాటర్ పంప్, వాష్ బేసిన్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని పోలీసులు చెప్పారు. వాటర్ పంప్ బ్యాటరీ తొలగించే క్రమంలో మద్యం మత్తు కారణంగా అతడు అక్కడే నిద్రపోయి ఉంటా డని పోలీసులు భావిస్తున్నారు.

రూమ్ అంతా ఏసీ కూలింగ్ ఉండటంతో కాసేపు నిద్రపోయి వెళ్దామ ని అతను అనుకుని ఉంటాడని కానీ మద్యం మత్తు కారణంగా అత డికి తెలివి రాలేదని పోలీసులు వెల్లడిస్తున్నారు. నిందితుడిని అదు పులోకి తీసుకున్న పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమో దు చేయగా కొన్ని నెలల క్రితం ఓ దొంగతనం కేసు అరెస్టైన నిందితు డు ఇటీవలే జైలు నుం చి విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు.