Uttar Pradesh Family Tragedy :ప్రజా దీవెన, ఉత్తర్ ప్రదేశ్: ఉత్తర్ప్ర దేశ్‌లోని గోరఖ్‌పుర్ జిల్లాలో హృద య విదారక సంఘటన చోటు చే సుకుంది. దూరదృష్టి లేకుండా క్షణి కావేశంలో తీసుకున్న నిర్ణయం యావత్ కుటుంబాన్ని మింగేసింది. తల్లి తిట్టిందన్న కోపంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తె లిసిన ఆ యువకుడి తల్లి, సోదరి మనోవేదనతో తనువు చాలించా రు. గోరఖ్‌పుర్ జిల్లాలోని హర్పూర్ బుధాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుచ్‌దేహరి పంచాయతీలో ఈ ఘో రం దుర్ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మోహిత్ కన్నౌజియా అ నే యువకుడు ముంబయిలో కూలీ గా పనిచేసేవాడు. అతను వారం క్రితమే గోరఖ్‌పుర్‌లోని ఇంటికి వ చ్చాడు. బుధవారం రాత్రి మోహిత్ తన సోదరికి మెడిసిన్ కోసం షాప్‌కు వెళ్తున్న క్రమంలో దారిలో అతని అమ్మ కౌసల్య దేవి, సోదరి సుప్రి యలు కనిపించారు. ఒక విషయం లో తల్లి, కొడుకు మధ్య దారిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆవే శంతో ఇంటికి వచ్చిన మోహిత్ ఇం ట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసు కున్నాడు.
కాగా కౌసల్య దేవి, సుప్రియ ఇంటికి వచ్చేసరికి గదిలో మోహిత్ శవ మైన కనిపించారు. దీంతో మోహిత్ మృతిని తట్టుకోలేని తల్లి, సోదరి ఇద్దరూ కూడా విషం తాగారు. ఈ విషయం తెలిసిన స్థానికులు పో లీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తల్లి, కుమార్తెను ఇ ద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి పంపి, మోహిత్ మృతదేహాన్ని పో స్ట్ మార్టం కోసం పంపారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి, కూతురు కూడా మరణిం చారు. తల్లి, కూతురు, కొడుకు ఒకేసారి మరణించడం ఆ ప్రాం తమంతా శోకసంద్రంలో ముని గిపోయింది. మోహిత్ తండ్రి అం గద్ కన్నౌజియా 10 సంవత్సరాల క్రితమే చనిపోయారు. పోలీసులు ఈ ముగ్గురి ఆత్మహత్యపై కేసు న మోదు చేసి దర్యాప్తు ప్రారం భించా రు. దర్యాప్తు కొనసాగుతోందని, అయితే ఆ కుటుంబానికి చెందిన వారి నుంచి తమకు ఇంకా ఎలాం టి ఆధారాలు రాలేదని నార్త్ ఎస్పీ జితేంద్ర శ్రీవాస్తవ తెలిపారు. వీళ్ల మరణానికి అసలు కారణం ఇంకా నిర్ధరించలేదని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ వివాదాలు, మానసిక ఒత్తిడి వంటి కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.