Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Visakhapatnam: నీలి చిత్రాలు చూపిస్తూ నీచంగా, మనస్థాపంతో భార్య ఆత్మహత్య

Visakhapatnam: ప్రజా దీవెన, విశాఖపట్నం: సభ్య సమాజం తలదించుకునే విధంగా చరవాణిలో చూపిస్తూ అందులో ఉన్నట్టుగా చేయాలని బలవంతం చేస్తున్న భర్త ఆగడాలు వెలుగు చూసాయి. భర్త వేధింపులు భరిం చలేని భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విశాఖపట్నంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం నిందితుడు నాగేంద్రబాబుకు గతేడాది వివాహమైంది. బ్లూ ఫిల్మ్స్‌ చూడటాన్ని అలవాటుగా మార్చుకున్న నాగేంద్రబాబు వాటిని భార్య (23)కు చూపిస్తూ అలా చేయమని బలవంతం చేసేవాడు.

అంతేకాకుండా వయాగ్రా మాత్రలు కూడా వేసుకునేవాడని, దీంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి కూడా నాగేంద్రబాబు యధావిధిగా ప్రవర్తించడంతో ఇద్దరి మధ్య మరో మారు గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడు నాగేంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి వయాగ్రా ట్యాబ్లెట్ల డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.