Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

WomansArrest : రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆరుగురు మహిళామణులు, పేకాట ఆడుతూ అరెస్ట్

WomansArrest ప్రజా దీవెన, కదిరి: కదిరి పట్టణం పూల బజార్ బెస్త స్ట్రీట్ లో ఓ ఇం టిలో పేకాడుతూ మహిళా మణు లు పట్టుబడిన సంఘటన జరిగిం ది. కాలనీకి చెందిన చింతలకుంట చెన్న కేశవులు అనే వ్యక్తి తన స్వం త ఇంటిలో తాను, తన భార్యతో సహా మరో ఇదు మంది మహిళలు మొత్తము ఏడు మంది కలిసి జూదము ఆడుతూ ఉండగా సోమ వారం సాయత్రo సమయములో ఎస్సై బాబా జాన్ తన సిబ్బందితో కలిసి రైడ్ చేసి వారిని రెడ్ హ్యాం డెడ్ గా అరెస్టు చేశారు. వారి వద్ద నుండి మొత్తము రూ. 50,220 స్వాదీనము చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా మ రొక చోట పేకాట ఆడుతున్న 11 మంది పేకాట రాయళ్ళను అరెస్ట్ చేశారు. కదిరి టౌన్ కుటాగుల్ల గ్రామ శివారులో ఉన్న పులివెందు ల రోడ్ ప్రక్కన ఉన్న వాటర్ టాంక్ వద్ద పేకాట ఆడుతున్న కుటాగుల్ల గ్రామానికి చెందిన షేక్ రియాజ్ బాషా, వీర నారాయణ, శంకర, చలపతి, శ్రీరాములు, సూర్య నారాయణ, పూల ఉత్తన్న, మోహన్ రావు, గాలివీటి నారా యణ, ఫరూకి ఇమ్రాన్, ఓరకంటి కృష్ణా రెడ్డి అను వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 8,470/-లను స్వాధీనము చేసుకని కేసు నమోదు చేశారు.