Yadadri district: యాదాద్రి జిల్లాలో శవాల కలకలం
-రాయగిరి చెర్వులో వారం రోజుల్లో రెండు మృతదేహాలు లభ్యం --భయాందోళనలతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు
యాదాద్రి జిల్లాలో శవాల కలకలం
–-రాయగిరి చెర్వులో వారం రోజుల్లో రెండు మృతదేహాలు లభ్యం
–భయాందోళనలతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు
ప్రజా దీవెన /యాదాద్రి భువనగిరి: ఒకే చెర్వులో వారం రోజుల్లోనే ఇద్దరు శవమై తేలిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా లో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భువనగిరి మున్సిపల్ పట్టణ శివారులోని రాయగిరి చెరువులో గత వారం రోజుల్లో రెండు మృతదేహాలు లభించడం తీవ్ర కలకలం సృష్టించింది.
రాయిగిరి చెర్వు లో ఓ పురుషుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ఆయితే తాజాగా శనివారం రోజునే ఇదే చెరువులో 45 సంవత్సరాల వయసు కలిగిన ఓ పురుషుడి మృతదేహం స్థానికులకు కనిపించింది.
కాగా గత నాలుగైదు రోజుల్లోనే రెండు మృతదేహాలు ఒకే చెరువులో లభ్యం కావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఆ రెండు మృతదేహాలు ఎవరివి, ఎక్కడివి, ఎవరన్నా హత్య చేసి ఇక్కడ పారేశారా, లేదంటే వారే ఆత్మహత్యలు చేసుకున్నారా అనే పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. చెరువులో మృతదేహాలను చూసి స్థానిక ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు.