Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Acidity Tips: అసిడిటీతో బాధ పడే వారికీ ఇది ఒక గొప్ప ఔషధం..?

Acidity Tips: సాధారణంగా పండగల సీజన్‌ వచ్చిందంటే విందు భోజనాలకు పెట్టింది పేరు అని చెప్పాలి. అయితే కొందరికి కాస్త తినగానే జీర్ణక్రియలో (digestion) ఆటంకం ఏర్పడి కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి . దీంతో వారికీ శరీర అసౌకర్యం, గుండెల్లో మంట స్టార్ట్ అవుతుంది. అకస్మాత్తుగా తలెత్తే ఈ సమస్య నుంచి సులువుగా ఉపశమనం పొందాలంటే కొన్ని ఇంటి చిట్కాలు ట్రై చేయమని సలహా ఇస్తున్నారు డాక్టర్లు . అవి ఏమిటంటే..

వాస్తవానికి జీర్ణక్రియ, కడుపు నొప్పికి అల్లం ఉత్తమ పరిష్కారం అనే చెప్పాలి. అల్లం ఘటు కడుపు సమస్యలను ఇట్టే తరిమి కొడుతుంది. అల్లం రసంలో కాస్తంత తేనే జోడింది రోజుకు 2-3 సార్లు తీసుకుంటే సరి.. జీర్ణ సమ్యల నుంచి బయట పడవచ్చు. అలాగే సాధారణ టీకి బదులుగా అల్లం టీని తాగితే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఇక ఈ జీర్ణ చికిత్సలో (Digestive treatment) ఇంగువ, సోంపు గింజలు (Asafoetida and Anise seeds)బాగా పని చేస్తాయి. అలాగే నీళ్లలో 1 టీస్పూన్ ఇంగువ, 1/4 టీస్పూన్ సోంపు గింజలు వేసి బాగా మారగా పెట్టాలి అనంతరం కప్పులో పోసుకుని వేడిగా తాగితే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు

ఈ టిప్స్ లో మరొకటి ఏమిటంటే .. రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా పెరుగును తీసుకోవాలి . ప్రతిరోజూ పెరుగు తింటే మంచి బ్యాక్టీరియా పేగుల్లో చేరి జీర్ణ క్రియను (digestion) క్రమబద్దీకరిస్తాయి. నిజానికి పెరుగు కడుపుని చల్లగా ఉంచుతుంది కూడా. అయితే కొంత మందికి లాక్టోస్ అలర్జీ తో బాధ పడుతూ ఉంటారు. ఇటువంటి వారు పాలు లేదా పాల ఉత్పత్తులు తినడం వళ్ల శరీరంపై దద్దుర్లు వస్తాయి. వీళ్లు పెరుగు తినకపోవడమే మంచిదని అభిప్రాయం.

ఈ టిప్స్ లో మరొకటి ఏమిటంటే పుదీనా ఆకులను నిత్యం పచ్చిగా నమలగలిగితే ఎలాంటి సమస్య కూడా మన దగ్గరకు రావు. కానీ ఏదైనా సమస్య ఉంటే మాత్రం పుదీనా టీని తగవచ్చు. కాసిన్ని పుదీనా ఆకులను (Mint leaves)నీటితో మరగబెట్టి కప్పులో పోసుకుని తాగితే మాత్రం కడుపు ఆరోగ్యంగా ఉండడం తో పాటు అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది