Almonds: బాదం పప్పు గురించి జనాలకు తెలిసిందే. అత్యంత ఖరీదైన పప్పులతో బాదం పప్పు ఒకటి. అందుకే దీనిని అందరూ కొనుక్కొని తినలేరు. కానీ అనవసర ఖర్చులు తగ్గించుకొని ఇలాంటివి కొనుక్కొని తినడం వలన అనేక లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకొనే ఆహారంలో డ్రైఫ్రూట్స్ (dry fruits)క్రమం తప్పకుండా ఉండేలా చూసుకొని ఉంటే శారీరకంగా బలంగా ఉండవచ్చు. ముఖ్యంగా బాదం పప్పులను రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు (Fats, vitamins, antioxidants, minerals) అనేకం ఉంటాయి. బాదంలో విటమిన్-ఇ, కాల్షియం, పీచు పదార్థాలు, మాంగనీస్, రైబోప్లోవిన్, కాపర్ సైతం ఉంటాయి. పెద్దవాళ్లు రోజుకు ఎనిమిది నుంచి పదికి బాదం పప్పులను మించకుండా, పిల్లలు నాలుగు నుంచి ఆరు బాదం పప్పులను మించకుండా విధిగా తీసుకుంటే ఉత్తమం అని అంటున్నారు. అయితే, బాదంను నేరుగా తినేయకుండా నీటిలో 7 నుంచి 8 గంటలు నానబెట్టి, తొక్క తీసి తినడం వలన ఆరోగ్యకరం అని చెబుతున్నారు. ఎందుకంటే నానబెట్టడం వల్ల పోషకాలు వేగంగా శరీరానికి అందుతాయి.
అయితే ఇక్కడ బాదం (almonds) ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా తినడం వలన కూడా అనర్ధాలు జరుగుతాయని మర్చిపోవద్దు. బాదం మొతాదు మించితే కొవ్వులు అమాంతంగా పెరిగిపోతాయి. అదే విధంగా శరీరంలో విషతుల్యాలు పెరిగి, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. అందుకే పైన చెప్పినట్టు తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. బాదంలో కూడా నాలుగో వంతు కాల్షియం ఉంటుందని చెబుతున్నారు. దీని వల్ల మీ ఎముకలు బలోపేతమవుతాయి. విరిగిపోకుండా స్ట్రాంగ్‌గా ఉంటాయి. బాదం రక్తంలోని చక్కెర స్థాయిలను సైతం బాదం నియంత్రిస్తుంది కాబట్టి వీటిని తీసుకోవచ్చు. అవును, బాదం తినేవారిలో టైప్-2 డయాబెటీస్, మెటాబాలిక్ (జీవక్రియ) సిండ్రోమ్ తదితర రసమస్యలు అదుపులో ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో గుర్తించారు. కాబట్టి అవసరాన్ని బట్టి బాదం పప్పుని విధిగా వాడితే ఆరోగ్యానికి ఎంతో మంచింది.