Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Aloe Vera Benefits: కలబందతో మెరిసే అందం ఎలాగంటే..?

Aloe Vera Benefits: నిజానికి అలోవెరాలో A, C, E విటమిన్లు , ఫోలిక్ యాసిడ్, కోలిన్, B1, B2, B3, B6, B12 విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, జింక్, క్రోమియం, సెలీనియం, సోడియం, ఐరన్, పొటాషియం (Vitamins A, C, E, Folic Acid, Choline, B1, B2, B3, B6, B12 Vitamins, Calcium, Magnesium, Zinc, Chromium, Selenium, Sodium, Iron, Potassium)లాంటి అనేక రకాల ఖనిజాలు లభిస్తాయి. ఇవి అన్ని కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందు కోసమే మన ఆయుర్వేదంలో కూడా కలబందకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో వ్యాధుల నివారణకు దీనిని ఔషధంగా వాడుతారు. కనుక అలోవెరా జెల్ ప్రయోజనాలు, దానిని ఎలా ఉపయోగించాలో మనం తెలుసుకుందాం..

వాస్తవానికి అలోవెరా జెల్ ముఖంపై ఫైన్ లైన్స్ (Fine lines) సమస్య నుంచి బయటపడటానికి బాగా సహాయ పడుతుంది. అలాగే ఈ జల్ ను చేతులు, ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంలో కొల్లాజెన్ స్థాయిలు పెరిగి చర్మం బాగా మెరుస్తుంది. దీన్ని రోజూ ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా (Soft and healthy)కూడా మారుతుంది.

అలాగే అలోవెరా (Aloe vera)మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అలోవెరా జెల్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల దద్దుర్లు, ముఖం వాపు నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల సూర్యకిరణాలు చర్మంపై ప్రభావం చూపవు. బయట ఎక్కువ పని చేసే వారు ఇంటికి వచ్చిన తర్వాత అలోవెరా జెల్‌ని ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం వస్తుంది అని నిపుణులు అంటున్నారు.

మనలో ఎవరైనా సరే రాత్రిపూట అలోవెరా జెల్‌ను ముఖానికి రాసుకుంటే ముఖ రంధ్రాలలో పేరుకుపోయిన దుమ్మును పోగొట్టి ముఖంపై మొటిమలను కూడా చాలా సులువుగా నివారించవచ్చు. ముఖంపై విడుదలయ్యే అధిక నూనె (oil)మొటిమలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిల్లో చర్మం నుంచి అదనపు నూనెను తొలగించడానికి అలోవెరా జెల్ బాగా సహాయ పడుతుంది.