Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Alum jaggery: పటిక బెల్లంతో లాభాలే లాభాలు..?

Alum jaggery: పిల్లలకు తీపి ఇవ్వాలంటే ఎక్కువగా పటిక బెల్లం (Alum jaggery) వాడతారు. ఇంట్లో అందరూ పటిక బెల్లాన్ని తింటూ ఉంటారు. పటిక బెల్లం అంటే కేవలం పంచదారకు బదులు వాడేది మాత్రమే కాదు. ఇందులో శరీరానికి మంచి పోషకాలు (Nutrients) ఉంటాయి. ఇది సహజమైన తీపి, పంచదార కంటే ఆరోగ్యానికి మంచిది. పటిక బెల్లం పంచదారతోనే తయారవుతుంది కానీ రకరకాల రకాలుగా ఉంటుంది. పటిక బెల్లం తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

పటిక బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) అనే మంచి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుంచి రక్షిస్తాయి. చలికాలంలో తరచూ జబ్బుపడే వారికి ఈ పటిక బెల్లం చాలా మంచిది. ముఖ్యంగా చిన్న పిల్లలకు పంచదారకు బదులు పాలకర్ర ఇస్తే చాలా బాగుంటుంది.

శక్తిని పెంచుతుంది

పటిక బెల్లం తింటే వెంటనే శక్తి వస్తుంది. రోగ నిరోధక శక్తి (Immunity power) తక్కువగా ఉన్న వారికి ఇది చాలా బాగుంటుంది. అలసటగా లేదా నీరసం అనిపిస్తే పటిక బెల్లం జ్యూస్ లేదా పాలలో కలిపి తాగితే చాలా మంచిది.

రక్తహీనతను తగ్గిస్తుంది

పటిక బెల్లంలో ఐరన్ (Iron) పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత (Anemia) ఉన్నవారు రోజూ పటిక బెల్లం తింటే ఆ సమస్య తగ్గుతుంది. ఆడవారికి వచ్చే నెలసరి సమస్యలకు కూడా పటిక బెల్లం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఎముకలను బలపరుస్తుంది

పటిక బెల్లంలో కాల్షియం (Calcium) అనే పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల (Bones)ను బలపరుస్తుంది. చిన్న పిల్లలకు పటిక బెల్లం ఇస్తే వారి ఎముకలు బలంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు కూడా తగ్గుతాయి.

చర్మాన్ని మెరుగుపరుస్తుంది

పటిక బెల్లం చర్మానికి (Skin) చాలా మంచిది. మార్కెట్లో దొరికే క్రీములలా కాకుండా పటిక బెల్లం చర్మాన్ని మెరిసేలా చేసి, ముడతలు పడకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.