Balanced Diet : ప్రజా దీవెన, శాలిగౌరారం : గర్భిణీ స్త్రీలు నిత్యం సమతుల్య ఆహారం తీసుకున్నపుడే సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటారని శాలిగౌరారం మండల వైద్యాధికారి డాక్టర్ శ్వేత అన్నారు.శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్బంగా శ్వేత మాట్లాడుతూ ప్రతి గర్భిణీ డాక్టర్ల సలహాలు తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రి లోనే ప్రసూతి కావాలన్నారు. పౌష్టికాహార దాతలు లయన్స్ క్లబ్ సర్వీస్ కోర్డినేటర్ రాపాక రాజు-సరిత దంపతులకు రెండవ కుమార్తె త్రిధశ్రీ పుట్టిన రోజు సందర్బంగా గర్భణి మహిళలలకు, ఆరోగ్య కేంద్రం సిబ్బందికి అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ జోన్ ఛైర్మెన్ బుడిగె శ్రీనివాసులు, డిసి డెంకల సత్యనారాయణ, క్లబ్ అధ్యక్షులు గుజలాల్ శేఖర్ బాబు, కార్యదర్శి దామెర్ల శ్రీనివాస్, కోశాధికారి గుండు పరమే ష్,పిహెచ్ఎన్ రాములమ్మ,సూపర్ వైజర్లు దయామణి మరియా, లయన్ క్లబ్ ప్రతినిధులు దునక వెంకన్న,సీఎం రెడ్డి, వడ్లకొండ బిక్షం,మురారిశెట్టి కరుణాకర్, గుండ్ల రామ్మూర్తి,బట్ట చిన సైదులు, కప్పల శ్రీకాంత్, హెల్త్ అసిస్టెంట్లు,ఏ ఎన్ ఎం లు ఆకారం, భైరవు నిబండ గ్రామాల గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.