Black Pepper: కొంత మందికి వర్ష కలం మొదలు అయిదంటే చాలు జలుబు, దగ్గు , ఫీవర్ (Cold, cough, fever)అని అనేక వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం రక్షించుకోవడానికి నల్ల మిరియాల (Black Pepper) ఔషధంగా పని చేస్తుంది. నల్ల మిరియాల్లో యాంటీమైక్రోబయల్, యాంటీ అలెర్జిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ గ్యాస్, డైయూరిటిక్, డైజెస్టివ్ లక్షణాలు అధికంగా లభిస్తాయి.వీటితో మనం బరువు తగ్గడం, జీర్ణవ్యవస్థను, రోగనిరోధక శక్తిని (Weight loss, digestive system, immunity)బలపరుస్తుంది.
ఇక వర్షా కాలంలో మాత్రం మిరియాల కషాయం తాగితే జలుబు, దగ్గు (Cold, cough)సమస్యల నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా మిరియాలు తినడం వల్ల గొంతు నొప్పి నుంచి కూడా త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఇక బరువు తగ్గడానికి చాలా మంది అనేక రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. మనలో చాల మంది ఊబకాయంతో సతమతమవుతున్నట్లయితే, దాన్ని తగ్గించుకోవడానికి మిరియాలు ఆహారంలో జత చేసుకోండి..
ఇక వర్షాకాలంలో కండరాలు, కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే మీ ఆహారంలో మిరియాలు తప్పక చూసుకోవాలి. అలాగే మిరియాలు కీళ్ల నొప్పులు, వాపుల నుండి ఉపశమనాన్ని మనం పొందవచ్చు. మిరియాల్లోని యాంటీ-అలెర్జిక్, ఆర్థరైటిక్ (Anti-allergic, arthritic)గుణాలు నొప్పి, మంటను చాల ఈజీ గా తగ్గిస్తాయి.