Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Black Pepper: నల్ల మిరియాలు మగవారికి ఎంతో మేలు.. ఎలాగంటే..

Black Pepper: మిరియాలు (Black pepper) అంటే మన ఇళ్లలో రోజూ వాడే మిరియాల పొడి. అది కేవలం ఆహారానికి రుచిని ఇచ్చేది కాదు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అది ఒక మంచి మందులా కూడా పనిచేస్తుందట.

 

మిరియాలలో కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు ఉంటాయి. వాటిని క్యాప్సైసిన్ (Capsaicin) అంటారు. ఈ క్యాప్సైసిన్ మన శరీరానికి చాలా మంచిది. అనేక రకాల అనారోగ్యాలను తగ్గించడానికి, శరీరాన్ని కాపాడడానికి ఇది ఉపయోగపడుతుంది.

 

ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారంటే, రోజూ ఉదయం ఉపవాసం ఉన్నప్పుడు కాస్త మిరియాల పొడి (pepper powder)ని వెచ్చని నీటిలో కలిపి తాగితే చాలా మంచిదట. ఇలా చేయడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట.

 

మిరియాలు శక్తిని పెంచుతుంది

 

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగితే, శరీరానికి ఎక్కువ శక్తి (Energy) వస్తుంది. ఇది ముఖ్యంగా ఎక్కువ పని చేసే వారికి చాలా మంచిది. ఇది శరీరంలోని వాటర్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది.

 

డైజెషన్ ప్రాబ్లమ్స్‌కి చెక్

 

గ్యాస్ లేదా ఎసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు, నిమ్మరసంలో కొద్దిగా మిరియాల పొడి, కరివేపాకు కలిపి తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది.

 

ఒత్తిడి తగ్గుతుంది

 

మిరియాలలో పైపెరిన్ (Piperine) అనే పదార్థం ఉంటుంది. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. దీంతో ఒత్తిడి, బాధలు తగ్గుతాయి.

 

వీక్ గమ్స్‌కి చెక్

 

మిరియాలు చిగుళ్ల నొప్పిని తగ్గిస్తుంది. మిరియాలు, మజుఫాల్ (ఓక్ గాల్స్), గోరువెచ్చని ఉప్పు వీటిని కలిపి పొడి చేసి, అందులో కొద్దిగా ఆముదం కలిపి పళ్లు, చిగుళ్లపై రాసుకుని, అరగంట తర్వాత నోరు బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే పళ్ళు, చిగుళ్ల నొప్పి తగ్గుతుంది.

 

క్యాన్సర్‌ను నిరోధిస్తుంది

 

మిరియాలు స్త్రీలకు చాలా మంచిది. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి.

 

జలుబు నుంచి ఉపశమనం

 

నల్ల మిరియాలు జలుబు (Cold)తో బాధపడే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెచ్చటి పాలలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. తీవ్రంగా జలుబుతో బాధపడుతున్న వారు లేదా ఎక్కువగా తుమ్ములు వస్తున్న వారు మిరియాల పాలు తాగితే చాలా మంచిది.

 

దాహాన్ని తగ్గిస్తుంది

 

శరీరంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు వెచ్చటి నీటిలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగితే చాలా మంచిది. ఇది దాహాన్ని తగ్గిస్తుంది, అలసటను తగ్గిస్తుంది. అంతేకాకుండా డ్రై స్కిన్ సమస్య నుంచి రిలీఫ్ కలిగిస్తుంది.