Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Blood Sugar Patients: మీరు బ్లడ్‌ షుగర్‌ తో భాద పడుతున్నారా అయితే ఇది మీ కోసమే

Blood sugar Patients: ప్రస్తుతం చాలామంది బాధపడే వ్యాధులలో మధుమేహం కూడా ఒకటి. దీంతో శరీరంలో రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను బాగా పెరిగిపోతాయి. డయాబెటిస్ (diabetics) వల్ల రక్తంలో ఉండే చక్కెర స్థాయి ఎక్కువ మోతాదులో ఉండడంతోనే ఆరోగ్యం బాగా దెబ్బ తింటుంది. ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువగా అవ్వడంతో మూత్రపిండాలపై వైఫల్యం, ప్రాంతాకరమైన గుండె జబ్బులు, లాంటివి ఎక్కువగా తలెత్తుతాయి. అయితే డయాబెటిస్తో ఉన్నవారు క్రమం తప్పకుండా ఈ జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ (Blood sugar) నియంత్రణలో ఉంచుకోవచ్చని డాక్టర్స్ తెలియచేస్తున్నారు. అసలు ఇంతకు ఈ జ్యూస్ ఏమిటో తెలుసుకుందామా… అదేనండి మనకు ఎల్లవేళలా దొరికే కాకరకాయతో తయారు చేసే కాకరకాయ జ్యూస్.

ఈ కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల మీ ఇన్సులిన్ సెన్సిబిలిటీని (Insulin sensitivity) మెరుగుపరిచేలాగా చేస్తుందని, అలాగే జీనక్రియను పెంచుకోవడంతో పాటు, గ్లూకోస్ సోషల్ అని కూడా నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ కాకరకాయ జ్యూస్ క్రమం తప్పకుండా రోజు తీసుకుంటే మాత్రం అనేక లాభాలు డయాబెటిస్ (diabetics) వారు పొందవచ్చు. నిజానికే కాకరకాయ జ్యూస్ చేదుగా ఉంటుంది కానీ మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. కాకరకాయలో ఉండే ఇన్సులిన్ (isulain) లాంటి సమ్మేళనం కూడా ఉంటుంది. దీంతో షుగర్ పేషంట్లలో ఉండే రక్త చక్కెర స్థాయిలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. నిజానికి కాకరకాయలలో విటమిన్ సి, బీటా కెరోటిన్, ఇతర పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి .

దీంతో ఆక్సీకరణ ఒత్తిడిని (Oxidative stress)తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గడం వల్ల కాకరకాయ రసం డయాబెటిస్ రోగులలో లాంటి సమస్యల నుండి బయటపడేస్తుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల బరువును కూడా చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. కాకరకాయ జ్యూస్ లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, దీంతో బరువు తగ్గడానికి వీలు ఉంటుంది. అలాగే డయాబెటిస్ పేషన్స్ వారు బరువు (weight loss)తగ్గడం చాలా అవసరం కనుక వారు క్రమం తప్పకుండా కాకరకాయ జ్యూస్ తాగుతే మాత్రం చాలా మంచిది అని డాక్టర్స్ తెలియజేస్తున్నారు