Butter Milk: మనలో చాలా మంది ఉదయం నిద్రలేవగానే కాఫీ, టీలు తాగడం అలవాటు ఉంటుంది. కానీ, ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో ఒక గ్లాసు మజ్జిగ (Butter Milk) తాగితే ఏమవుతుందో తెలుసా …ఆలా మజ్జిగతో బోలెడన్నీ లాభాలు లభిస్తాయి. ఇక మజ్జిగ జీర్ణక్రియను పెంచుతుంది, క్యాలరీలను తగ్గిస్తుంది. రోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత మజ్జిగ తాగడం వల్ల పొందే మరికొన్ని ప్రయోజనాల గురించి మనం ఇప్పడు చూద్దాం. అవి ఏమిటంటే..మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు బాగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు (Health professionals) అంటున్నారు. అలాగే మజ్జిగలో ఉండే గుణాలు ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేసి, మలబద్ధకం, అజీర్ణం (Constipation, indigestion) వంటి సమస్యలను తగ్గించేందుకు సహాయ పడుతుంది.
ఇక రోజూ ఉదయం మజ్జిగ తాగడం వల్ల పొట్ట చల్లగా ఉంచి, కడుపులో (stomach) మంటను తగ్గించేందుకు సహాయ పడుతుంది. అలాగే అసిడిక్ రిఫ్లెక్షన్ వల్ల పొట్టలో చీకాకును కూడా తాగిస్తుంది. తరచుగా జీర్ణక్రియ సమస్యలతో (Digestive problems) బాధపడేవారు ప్రతి రోజు ఆహారాలు తీసుకున్న తర్వాత మజ్జిగ తాగడం వల్ల అనేక ఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు మన గుండెను కూడా ఆరోగ్యంగా చేస్తాయి.
ఇక వ్యాయామం చేసిన తర్వాత మజ్జిగ తాగడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. ఆలాగే మజిల్ బిల్డింగ్ చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు (Health professionals) తెలుపుతున్నారు. అలాగే మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ రోగ నిరోధక శక్తి ను కూడా సులభంగా పెంచుతుంది. దీని కారణంగా జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అలాగే ముఖ్యంగా మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలను తొలగించేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. దీంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా ఉంచేందుకు సహాయ పడుతుంది.