Curd Eating: ప్రతిరోజు పెరుగు తిన్నవారిలో అనేక రకాల ఆరోగ్యకరమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఆరోగ్య నిపుణులే స్వయంగా చెబుతున్నారు. పెరుగు ఎవరికి ఇష్టం ఉండదు… పాలు, పెరుగు (Milk, curd) అనేవి చిన్నప్పటి నుండే మన ఆహారంలో ఒక భాగం అయిపోయాయి. ఇప్పుడు పట్టణీకరణ వ్యవస్థ పెరిగిపోయింది గాని, ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో గేదెలు, ఆవులు ఉండేవి. దాంతో నిన్న మొన్నటి తరాలు విరివిగా పాలు, పెరుగు, నెయ్యి వాడకాన్ని జరిపేవి. అయితే, నేడు పరిస్థితులు మారాయి. పల్లెల్లే పట్నాలుగా మార్పు చెందుతున్నాయి. వ్యవసాయం తగ్గిపోయి, వ్యాపారాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే పాల ఉత్పత్తుల వ్యాపారం రాజ్యమేలుతోంది. అయితే ప్రతిరోజు పాల ప్యాకెట్లు (Milk packets) కొనుక్కొని తాగే వారి ఆరోగ్యం గురించి దేవుడికి ఎరుక గాని, స్వచ్ఛమైన ఆవు పాల ద్వారా తయారుచేసిన పెరుగు తినడం వలన అనేక లాభాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదేమిటో ఇక్కడ చూద్దాం…
మీరు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పెరుగుని యాడ్ చేసుకుంటే ఊహించని మార్పులు సంభవిస్తాయి. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ శరీరానికి నేరుగా అందడం వలన చాలా లాభాలు చేకూరుతాయి. పెరుగులో ప్రోటీన్స్, కాల్షియం, మినరల్స్ (Proteins, calcium, minerals) పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఎముకలు గట్టిపడడానికి పెరుగు ప్రత్యక్షంగా సహకరిస్తుంది. ఇందులోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా పెరగడానికి తోడ్పడుతుంది. కాబట్టి మలబద్దకం సమస్యలు రాకుండా ఉంటాయి.
ఇక పెరుగులో (curd) ఎక్కువ మోతాదులో ప్రోటీన్ ఉండడం వలన బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది కాబట్టి ఇది మీ శరీరాన్ని శక్తివంతంగా, కాంతివంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక మొత్తంగా ప్రతిరోజు పెరుగు తీసుకోవడం వలన నీలో రోగనిరోధక శక్తి పెరిగి, సీజనల్ వ్యాధులు (Seasonal diseases) అనేవి దరి చేరకుండా ఉంటాయి.