Custard Apple: శీతాకాలంలో లభించే ‘సీతాఫలాన్ని’ (Custard Apple) మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చాలా చవకగా లభించే సీతాఫలం ఒక రుచికరమైన మరియు పోషక విలువలతో కూడిన పండు. బేసిగ్గా ఇది శీతాకాలంలోనే (winter season) దొరికే అమృతఫలం. దీనిని తినడం వలన అనేక లాభాలున్నాయని చెబుతున్నారు.
ఉపయోగాలు:
1. సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి, హిమోగ్లోబిన్ మెరుగుపరిచి రక్తహీనతను నివారిస్తుంది.
2. సీతాఫలంలోని యాంటీ ఒబెసియోజెనిక్, బయోయాక్టివ్ అణువులు, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.
3. దీనిని తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.
4. ఈ పండు పుష్కలంగా విటమిన్లను కలిగి ఉంటుంది.
5. ఇందులో ఉండే ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని అనేక రకాలుగా కాపాడతాయి.
6. సీతాఫలంలోని పొటాషియం మరియు మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడతాయి.
7. ఇందులోని ఫైబర్(పీచు పదార్ధం) మలబద్ధకాన్ని నివారిస్తుంది మరియు జీర్ణ వ్యవస్థను నిలకడగా ఉంచుతుంది.
8. విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి. సీతాఫలంలోని విటమిన్ ఎ కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, తొందరగా ముడతలు పడకుండా కాపాడతాయి.
9. ఇక సీతాఫలంలోని విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
10. సీతాఫలంలోని ఫ్లేవనాయిడ్లు కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షిస్తాయి. సీతాఫలంలోని సహజ చక్కెరలు శరీరానికి శక్తిని అందిస్తాయి.
ఇక చాలామంది సీతాఫలం (Custard Apple) తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ పండిన సీతాఫలం లోపలి గుజ్జును తీసి చాలా తేలికగా తినవచ్చు. సీతాఫలం అనేది రుచికరమైన పండు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడింది కాబట్టి ప్రజలు ఈ కాలంలో దీనిని అమృతఫలంగా సేవించవచ్చు. ఇక షుగర్ వ్యాధి ఉన్నవారు అయితే ఆరోగ్య నిపుణుల సలహా తీసుకొని తినడం మంచిది.