Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Diabetics: డయాబెటిస్‌ రోగులు ఆలు తినవచ్చా ..?

Diabetics: ప్రస్తుత రోజులలో చాల మంది మధుమేహ వ్యాధితో (Diabetics) భాద పడుతూ ఉన్నారు. ఇలాంటి వారు ఆహారం తీసుకునే విషయంలో చాల కఠినంగా ఉండాలి. ఏం తినాలి.. ఎలాంటి పదార్ధాలు తినకూడదు అనే వాటిపై స్పెషల్ శ్రద్ధ పెట్టడం చాలా ఇంపోర్టుమెంట్. ఎందుకు అంటే రక్తంలో చక్కెర స్థాయిని పెంచే కార్బోహైడ్రేట్‌లను కలిగి ఉన్న బంగాళాదుంపలను షుగర్ బాధితులు తినాలా వద్దా అనే దానిపై తరచుగా ప్రశ్నలు వస్తనే ఉంటాయి. అయితే.. బంగాళాదుంపలు (potataoS) మధుమేహ రోగులకు నిజంగా హానికరమా..? తింటే ఏమవుతుంది..? అనే విషయానికి వస్తే బంగాళాదుంపల గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..?

నిజానికి.. అలెర్జీ లేని ఏదైనా ఆహార పదార్ధం, దాని పరిమిత పరిమాణంలో కూడా మధుమేహ వ్యాధిలో వాడుతారు. డయాబెటిక్ పేషెంట్ బంగాళాదుంపలను తినడం వల్ల బాధపడకపోయినా, దాని పోషకాలను పొందినప్పటికీ, దానిని సరిగ్గా తీసుకోవడం అవసరం అని డాక్టర్లు అంటున్నారు. అలాగే బంగాళాదుంపలలో పిండి పదార్ధం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కావున స్టార్చ్ లేని కూరగాయలతో దీనిని తీసుకోవాలి. అలాగే ప్రొటీన్లు, విటమిన్లు (Proteins and vitamins)పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం మంచిది.

ఇక వీటిలో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఇనుము, జింక్ (Potassium, magnesium, phosphorus, iron, zinc)వంటి అనేక పోషకాలు బంగాళాదుంపలలో పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు కూడా శరీరానికి బలాన్ని ఇస్తాయి. బంగాళదుంపలలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అయితే బంగాళదుంపలు ఎంత మోతాదులో తీసుకోవాలి అంటే ..వాస్తవినికి బంగాళదుంపలు ఒక రకమైన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. అంటే ఇందులో ఎక్కువ పోషకాలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణ పిండి పదార్థాలు అంటే పిండితో తయారు చేసిన లేదా ప్యాక్ చేసిన ఆహారం, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, సహజంగా లభించే చక్కెర దాని నుంచి తయారైన ఆహారాలు మరింత ప్రభావితం చేస్తాయి అని డాక్టర్లు అంటున్నారు.

డయాబెటిక్ రోగులు రోజంతా ఒక కప్పు బంగాళాదుంపల (POTATAO) (ఆలుగడ్డలు) కంటే ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. డయాబెటిక్ రోగులు ఆరోగ్యకరమైన రూపంలో బంగాళాదుంపలను తినాలన్న విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. బంగాళదుంప చిప్స్, ఫ్రైలు లేదా వేయించి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అని డాక్టర్లు సలహా.