Drumstick Benefits: మునగకాయ అద్భుతమైన ప్రయోజనాలు ఇవే
Drumstick Benefits: ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంతో ప్రతి ఒక్కరి జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక సమస్యలతో పాటు గుండె ఆరోగ్యంపై (heart health) తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఈ ప్రమాదాన్ని కొన్ని కూరగాయలతో దూరం చేసుకోవచ్చని వైద్య నిపుణులు తెలియ చేస్తున్నారు. అలాంటి పదార్థాలలో మునగకాయ ఒకటి అనే చెప్పాలి. ఇందులో అద్బుతంగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు.. మునగ చాలా సాధారణమైన కూరగాయ.. దీనిని మెయిన్ గా మన భారతదేశంలోని దాదాపు ప్రతి ప్రాంతంలోనూ తింటారు. ముఖ్యంగా సౌత్ ఇండియన్ రిసిపి సాంబార్‌లో దీనిని ఎక్కువగా వాడుతారు. అలాగే మునగ కూరతోపాటు ఫ్రై లాంటి స్పెషల్ వంటకాలను కూడా తయారుచేసుకోవచ్చు..
నిజానికి మునగకాయలో క్యాల్షియం, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, ప్రొటీన్లు, ఫైబర్, Calcium, Vitamin B, Vitamin C, Vitamin E, Proteins, Fiber,)అనేక ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. అందుకే.. మునక్కాయను సూపర్ ఫుడ్ కంటే తక్కువ కాదంటారు.. ఇంకా మునగకాయలతో పాటు ఆకులు, వేర్లు కూడా ఆరోగ్యానికి మంచివిని డాక్టర్లు అంటున్నారు. మన మంచి ఆరోగ్యం కోసం మునగకాయను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి సులువుగా పొందుతారు. మునగకాయలో యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటిడిప్రెసెంట్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి .మునగలో లభించే విటమిన్ సి, విటమిన్ ఎ, క్యాల్షియం పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మునగకాయ అద్భుతమైన ప్రయోజనాలు (BENEFITS) ఏమిటంటే.. మునగ లేదా దాని ఆకులను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఆకులలో ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో బాగా సహాయ పడుతాయి.
ఈ క్రమంలో మునగకాయ తినడం వల్ల శరీరానికి శక్తి పెనుగుతుంది. అలాగే అలసట సమస్యను దూరం చేస్తుంది. ఐరన్ సమృద్ధిగా ఉన్న మునగ ఆకులు బలహీనతను తొలగించడంలో కూడా సహాయపడతాయి.అలాగే మునగ ఆకుల్లో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మునగ ఆకులు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.. ఇది ఆర్థరైటిస్, బోలు (Arthritis, hollow)ఎముకల వ్యాధితో పోరాడటానికి కూడా మీకు సహాయపడుతుంది. మునగ ఆకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంచుకోవచ్చు. వీటిని తినడం వల్ల డయాబెటిస్ రిస్క్ చాల సులువుగా తగ్గుతుంది.