Fat: నేటి తరం వయస్సుతో సంబంధం లేకుండా 30 ఏళ్ళు దాటకుండానే పొట్టలు పెంచేస్తున్నారు. దాంతో కడుపు ఉబ్బరంగా ఉండడం, ఊబకాయం వంటి సమస్యలు ఎక్కువమందిలో తలెత్తుతున్నాయి. అంతేకాకుండా అధిక బరువు జనాలను లావుగా మార్చడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు బరువు తగ్గవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేదంటే అధిక బరువు వల్ల కొవ్వు (Fat) పెరుగుతుంది. ఇది గుండెపోటు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే చాలామంది వ్యాయాయం చేసినా ఫలితం శున్యంగా ఉందని వాపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి నిపుణులు చక్కటి ఉపాయాన్ని సూచిస్తున్నారు. ప్రతి వంటింట్లో తప్పనిసరిగా లభించే ఈ పదార్థాన్ని పాలలో కలుపుకుని తాగడం వల్ల వారం రోజుల్లోనే బెల్లీ ఫ్యాట్ (Belly fat)కరిగి నీరుగా మారుతుంది అని వారు చెబుతున్నారు.
మీరు ఇలా పాలు (milk) తాగడం వల్ల బరువు తగ్గి స్లిమ్ గా కనిపిస్తారు అని అంటున్నారు. సాధారణంగా రోజూ పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది నమ్ముతారు. కానీ ఈ మసాలాను పాలలో కలుపుకుంటే ఒక నెలలోనే మీ బరువు తగ్గుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాసు పాలలో కలిపి తీసుకుంటే మీ పొట్ట కొవ్వు సులభంగా కరిగిపోతుందని అంటునాన్రు. ఒక గ్లాసు పాలలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మరిగించాలి. తర్వాత మరిగించిన పాలను కాసేపు చల్లారనివ్వాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మీ పొట్టలోని కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది.
దాల్చిన చెక్క (Cinnamon) గురించి అందరికీ తెలిసిందే. పులావ్, బిర్యానీ (Pulao, Biryani) చేయడానికి మనం ప్రధానంగా ఉపయోగించే చక్కానే దాల్చిన చెక్క అంటారు. దీనిని మీరు నిరభ్యంతరంగా పొడిగా చేసి పాలల్లో కలిపి తీసుకోవచ్చని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ఇలా చేస్తే నెలరోజుల లోపే రిజల్ట్ చేస్తారని అంటున్నారు. ఐతే దీనిని వాడేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఎందుకంటే మీమీ శరీర తత్త్వం బట్టి డాక్టర్స్ సూచిస్తారు కాబట్టి!