Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fennel Seeds Benefits: భోజనం తర్వాత సోంపు గింజలు తినడానికి కారణం ఏమిటంటే..?

Fennel Seeds Benefits: నిజానికి సోంపు గింజలు ఒక మ(Fennel Seeds)సాలా దినుసు. ఈ గింజలు రుచికరమైన రుచి మాత్రమే కాకుండా, ఇతర ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటాయి అన్న మాట లో ఎటువంటి సందేహం లేదు . ఈ గింజలను ఊరగాయలు, సుగంధ ద్రవ్యాల రుచిని మెరుగుపరచడానికి, మౌత్ ఫ్రెషనర్‌గా ( mouth freshener)వాడుతారు. ఇందులో పీచు, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి అనేక పోషకాలు లభిస్తాయి. దీనితో ఇవి మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అలాగే అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న సోంపును తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఫైబర్, క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల చర్మ సమస్యలను (Skin problems) దూరం చేయడంలో సహాయ పడుతుంది. ఈ క్రమంలో రోజూ ఉదయం ఖాళీ కడుపుతో సోపు నీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి అనేక ప్రయోజాలను పొందుతాము.. అవి ఏమిటంటే…

సోంపులో ఉండే ఫైబర్ (fiber) జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఆహారాన్ని జీర్ణం చేయడంలో, అపానవాయువు, అజీర్ణం, మలబద్ధకం (Flatulence, indigestion, constipation)వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. సోపు గింజలను రోజూ నమలడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి సులువుగా బయట పడవచ్చు. అలాగే సోంపు గింజల వాటర్ పెరుగుతున్న బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది. సోంపు గింజల తినడం వల్ల త్వరగా ఆకలి అనిపించదు. దీని వల్ల అతిగా తినడం మానేయవచ్చు. దీంతో ఊబకాయం సమస్యను చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు.

సోంపులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును (Blood pressure)నియంత్రిస్తుంది. ఇది రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫెన్నెల్ నమలడం వల్ల లాలాజలంలో జీర్ణ ఎంజైమ్‌ల పరిమాణం కూడా పెరుగుతుంది. మనలో చాలా మందికి తరచుగా నోటి దుర్వాసన ఉంటుంది. దానిని తొలగించడానికి చాలా మంది దీన్ని మౌత్ ఫ్రెషనర్‌ గా వాడుతారు. అలాగే సోంపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు .. నోటి దుర్వాసనను తొలగించి దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.