Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fenugreek seeds: మెంతి గింజల వల్ల కలిగే లాభాలు ఇవే!

Fenugreek seeds: మన ఇండియన్ కిచెన్ ఆరోగ్యానికి అమ్మవంటిదని అందరికీ తెలిసిందే. ఎందుకంటే మన కిచెన్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన పదార్ధాలు ఉంటాయి. వాటిని మనకి తెలియకుండానే మనం ఆరగిస్తామని మీకు తెలుసా? అందులో వంటింట్లో ఉండే దినుసుల వలన మనకి ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. వాటిలో మెంతులు ఒకటి. మెంతులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఇవి ఆరోగ్యానికి ఔషధంగా ఉపయోగబడతాయి. దీని గింజలు కొంచెం చేదు రుచిని కలిగి ఉంటాయి కానీ ఆరోగ్యానికి మాత్రం తియ్యని ఫలితాన్ని ఇస్తాయి.

మెంతి గింజలను (Fenugreek seeds) నీటిలో నానబెట్టి తయారు చేసిన మెంతి నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్‌ (Diabetes)ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడతాయి. మెంతులలో మెగ్నీషియం, ఐరన్‌, మాంగనీస్‌తో సహా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియని సమతుల్యం చేయడంతో పాటుగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మెంతి నీరు అనేది అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అదేవిధంగా ఆకలిని అణచివేయడం, జీవక్రియ రేటును పెంచడం, కొవ్వు (fat) పేరుకుపోవడాన్ని తగ్గించడం ద్వారా బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.

క్రమం తప్పకుండా మెంతినితిని (Fenugreek) తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగకుండా నివారించబడుతుంది. మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత కలిగిన వ్యక్తులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మెంతి నీళ్లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఉండే కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి ఆర్థరైటిస్, ఆస్తమా వంటి ఇన్‌ఫ్లమేషన్-సంబంధిత సమస్యలు నివారించబడతాయి. ఇక మరీ ముఖ్యంగా శరీరంలో ఆర్మోన్ల సమతుల్యతకు మెంతి నీరు అద్భుతంగా పని చేస్తుంది. ముఖ్యంగా మహిళల్లో రుతుక్రమం ఆగిపోయి ఇబ్బందులు పడుతున్న వారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఆదిమాత్రమే కాకుండా మెంతి నీరు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చుండ్రు లేదా దురద వంటి స్కాల్ప్ సమస్యలను నివారిస్తుంది.

అయితే, ఇక్కడ మీరు మెంతి నీటిని (Fenugreek water) తయారు చేసుకోవడం కోసం… మొదట 1 నుంచి 2 టీస్పూన్ల మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రిపూట అనగా… సుమారు 8 నుండి 10 గంటలు నానబెట్టి, ఆ నీటిని వడకట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగేయాలి. మెంతి నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.