Garlic: రోజూ పరిగడుపున లేదా ఖాళీ కడుపుతో కొన్ని వెల్లుల్లి (Garlic) రెబ్బలు తినడం ద్వారా ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వెల్లుల్లిని మితంగా తిన్నట్లయితే బీపీ తగ్గుతుంది. గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది. వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బ్లడ్ క్లాటింగ్ సమస్యలు తలెత్తవు. దీని ఫలితంగా హార్ట్ ఎటాక్ (Heart attack)వంటి సమస్యలు రావు. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్న వారికి కూడా వెల్లుల్లి ఒక దివ్య ఔషధం అవుతుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే గ్యాస్, ఎసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యలు మటుమాయమవుతాయి. ఇందుకు కారణం వెల్లుల్లిలో (Garlic) ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలే అని చెప్పుకోవచ్చు.
వెల్లుల్లి ఇది జీర్ణక్రియకు (digestion) కావలసిన రసాయనాల ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా, కడుపులో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది. ఇలా జరగడం వల్ల మనం తినే ఆహారం బాగా జీర్ణమవుతుంది, అందులోని పోషకాలు మన శరీరానికి సరిగ్గా అందుతాయి.పచ్చి వెల్లుల్లి (Garlic) రెబ్బలు తిన్నట్లయితే కడుపులోని చెడు బ్యాక్టీరియా చచ్చిపోతుంది. దీని ఫలితంగా మూత్రం, మలవిసర్జన సమస్యలన్నీ తొలగిపోతాయి. వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలోని విషతుల్యాలను బయటికి పంపిస్తాయి. అంతేకాదు కాలేయ పనితీరు కూడా మెరుగు పడుతుంది. వెల్లుల్లి (Garlic) చర్మానికి చాలా మంచిది. ఇందులో ఉన్న మంచి గుణాలు ముఖం మీద వచ్చే మొటిమలను తగ్గిస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం, ముఖం మీద మొటిమలపై తాజా వెల్లుల్లి రుబ్బితే అవి తగ్గుతాయని తెలిసింది.
ఆకుపచ్చ వెల్లుల్లిలో (Garlic) యాంటీఆక్సిడెంట్లు, సల్ఫర్ (Antioxidants, sulfur) వంటి సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ ను ఇంప్రూవ్ చేస్తాయి. డైలీ 2-3 వెల్లుల్లి రెబ్బలు తింటే ఈ వర్షాకాలంలో తలెత్తే వ్యాధులు నుంచి రక్షణ పొందవచ్చు. గార్లిక్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను వదిలించేస్తుంది. వెల్లుల్లిలోని యాంటీ హైపర్లిపిడెమియా లక్షణాలు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను (Cholesterol and triglycerides)తగ్గిస్తాయి.వెల్లుల్లిని ఎక్కువగా తింటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఏదైనా ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే ముందు డాక్టర్‌ను (docters)సంప్రదించడం మంచిది.