Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Green Chilli: పచ్చి మిర్చితో వెయిట్ లాస్ మీకు తెలుసా

Green Chilli: మన రోజువారీ వంట ఏదైనా సరే పచ్చి మిర్చి (Green Chilli) లేకుండా ఆ వంట పూర్తి కాదు. పచ్చి మిర్చి వాడడం తో కూరకు మంచి రుచి వస్తుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పచ్చి మిర్చిని కేవలం కారం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నాం అనుకుంటారు కొందరు. కానీ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు (Health professionals) తెలుపుతున్నారు.

అలాగే పచ్చి మిర్చి (Green Chilli) తినడం వల్ల అధిక బరువు నుంచి ఉపశమనం పొందుతారు. మన శరీరంలో అదనపు కొవ్వును ఫాస్ట్‌గా కరిగించడంలో పచ్చి మిర్చి చక్కగా సహాయం చేస్తుంది. పచ్చి మిర్చిలో ఉండే క్యాప్సైసిన్ అనే పదార్థం.. బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుందని అధ్యనాలు కూడా తెలుపుతున్నాయి..

ఇక పచ్చిమిర్చిలో క్యాన్సర్‌ని (Cancer) కణాలను నాశనం చేసే అనేక సమ్మేళనాలు కూడా లభిస్తాయి. పచ్చి మిర్చిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్, ప్రోస్టాటిక్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వంటి వాటికి దూరంగా కూడా ఉండొచ్చు.

పచ్చి మిర్చి (Green Chilli) తినడం వల్ల మన చర్మానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్ సి.. చర్మంపై వచ్చే వృద్ధాప్య లక్షణాలు దూరం చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని (Immunity) సైతం వేగంగా పెరుగుతుంది. అలాగే పచ్చి మిర్చి తింటే గుండె ఆరోగ్యం కూడా బాగా మెరుగు పడుతుంది. అలాగే టైప్ – 2 డయాబెటీస్‌ (Type-2 Diabetes) రాకుండా జాగ్రత్త కూడా పడొచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలను, శరీర నొప్పులు (Digestive problems and body aches) కంట్రోల్ అవుతాయి