Green Tea: ప్రస్తుతం ఉన్న రోజులలో అనేక మంది ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మొదలు పెట్టరు. ఈ క్రమంలో బరువు తగ్గడానికి, ఫీట్ గా ఉండేందుకు గ్రీన్ టీ (Green Tea) తాగుతూ ఉంటున్నారు. నిజానికీ సాధారణ టీతో పోలిస్తే.. గ్రీన్ టీ (Green Tea) ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు తెలుపుతున్నారు. అందుకే.. చాల మంది గ్రీన్ టీ తాగేందుకు ఇష్టపడతారు.. వాస్తవానికి గ్రీన్ టీ (Green Tea) మన శరీరానికి లెక్కలేనన్ని ప్రయోజనాలను పొందవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది హానికరం అని డాక్టర్లు సూచన. గ్రీన్ టీ ఎక్కువగా తాగడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే కొన్ని సమస్యలు ఉన్నవారు అయితే గ్రీన్ టీని (Green Tea) తీసుకోకూడదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
గ్రీన్ టీ ప్రయోజనాలు (Benefits)ఏమిటంటే గ్రీన్ టీ బరువు తగ్గడానికి అద్భుతమైనదిగా పరిగణిస్తారు. ఇందులో పాలీఫెనాల్స్, క్యాటెచిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది శరీరానికి మేలు చేస్తుంది. గ్రీన్ టీ (Green Tea) తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పరచడంతో పాటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అలాగే పొట్ట, నడుము కొవ్వును కూడా చాల సులభంగా కరిగిస్తుంది.
అయితే గ్రీన్ టీ ఎక్కువగా తాగితే కాలేయ సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. అలాగే గ్రీన్ టీలోని (Green Tea) కాటెచిన్స్, ముఖ్యంగా EGCG (ఎపిగల్లోకాటెచిన్ గాలెట్) కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే మిలో ఎవరైనా కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి దీనికి దూరంగా ఉంటె మంచిది అని డాక్టర్లు అంటున్నారు. అలాగే మన రోజుకు ఎంత గ్రీన్ టీ తాగాలి అన్న విషయానికి వస్తే రోజుకి 2 కప్పుల గ్రీన్ టీ తాగితే చాలు పెరుగుతున్న బరువు తగ్గుతారు అని వైద్య నిపుణులు అంటున్నారు.